అరగంట ముందే చేరుకోవాలి
జనగామ రూరల్: జిల్లాలో గ్రూప్– 3 పరీక్షను పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వారం రోజుల నుంచి జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్ మూడు దఫాలుగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పరీక్ష రాసేలా అన్ని చర్యలు తీసుకున్నారు. బయోమెట్రిక్ విధానంపై చీఫ్ సూపరింటెండెంట్, బయోమెట్రిక్ అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అభ్యర్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రం గేట్లు మూసివేస్తారని అధికారులు తెలిపారు. ఈ నెల 17న ఉదయం 10 నుంచి 12:30 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 3 నుంచి 5:30 గంటల వరకు పేపర్–2, 18న ఉదయం 10 నుంచి 12:30 గంటల వరకు పేపర్– 3 పరీక్ష జరగనుంది. ఇప్పటికే కలెక్టరేట్‌కు పరీక్షాకు సంబందించిన ఓఎంఆర్ షీట్‌లు చేరుకున్నారు. శనివారం వరకు ప్రశ్న పత్రాలు చేరుకోనున్నాయి.
16 పరీక్ష కేంద్రాలు..
జిల్లాలో మొత్తం 5,446 మంది అభ్యర్థులకు 16 పరీక్ష కేంద్రాల్లో పరీక్షకు హాజరుకానున్నట్లు పరీక్షల కన్వీనర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నర్సయ్య వివరించారు. పరీక్ష నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్‌లు 16, డిపార్ట్‌మెంటల్ అధికారులు 16, అబ్జర్వర్‌లు 16, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు 4, బయోమెట్రిక్ అధికారులు 43, ఐడెంటిఫికేషన్ అధికారులు 55, నాలుగు రూట్లలో నలుగురు రూట్ అధికారులను నియమించారు. కాగా రెండు రోజుల పాటు జరిగే గ్రూప్–3 పరీక్షకు ఎలాంటి సంఘటనలు చోటుచేసుకుండా సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఆర్టీసీ బస్సులు సరిపడా అందుబాటులో ఉండేలా ఆర్టీసీ డీఎం స్వాతి ఏర్పాట్లు చేశారు. అభ్యర్థుల సందేహాల నివృతికి ఇబ్బందుల రాకుండా కలెక్టరేట్‌లో కంట్రోల్ నంబర్ 9052308621ను ఏర్పాటు చేశారు.
గ్రూప్–3 పరీక్షకు సర్వం సిద్ధం
జిల్లాకు చేరుకున్న ఓఎంఆర్ షీట్స్
సందేహాల నివృత్తికి
9052308621 కంట్రోల్ నంబర్
Comments
Please login to add a commentAdd a comment