సమగ్ర సమాచారం
ఒక్క
క్లిక్..
జనగామ రూరల్: విద్యా వ్యవస్థ సమగ్ర సమాచా రాన్ని ఒకేచోట నిక్షిప్తం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందుకు యూ డైస్ ప్లస్(యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్) వెబ్‌సైట్ రూపొందించింది. ఇక నుంచి ఒక్క క్లిక్‌తో ప్రభుత్వ పాఠశాలల సమగ్ర సమాచారం వెబ్‌సైట్‌లో ప్రత్యక్షం కానున్నది. పాఠశాలల స్థితిగతులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల సమాచారంతో పాటు మౌలిక వసతులు ఏ పాఠశాలలో ఎలా ఉన్నాయి.. ఎంతమంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యారనే విషయాలు యూ డైస్ ప్లస్ ద్వారా స్పష్టంగా తెలియనుంది.
యూడైస్ నుంచి యూడైస్ ప్లస్
2021–22 వరకు యూడైస్‌గా కొనసాగిన ఈ వ్యవస్థను.. ఆ తర్వాత యూ డైస్ ప్లస్‌గా ఆధునికీకరించారు. గతంలో ఏడాదికోసారి సమాచారం అప్డేట్ చేయగా.. ఇకపై మూడు గంటలకోసారి సాంకేతికత ఆధారంగా సమాచారాన్ని అప్డేట్ చేసే అవకాశం ఉంది. వెబ్‌సైట్‌ను పాఠశాల మౌలిక వసతులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల మాడ్యూల్స్ అనే మూడు భాగాలుగా విభజించి సమాచారాన్ని నిక్షిప్తం చేస్తున్నారు. ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యాన ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. పాఠశాలల స్థితిగతులు అంశాల వారీగా వివరాలను వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేస్తున్నారు.
మొత్తం సమాచారం నిక్షిప్తం..
జిల్లాలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో కేజీ నుంచి ఇంటర్ వరకు చదువుకుంటున్న ప్రతీ విద్యార్థి వివరాలు వెబ్‌సైట్‌లో పొందు పరుస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, విద్యార్థుల వివరాలు ఉండగా.. ప్రస్తుత సమాచారంతో అప్డేట్ చేస్తున్నారు. అలాగే పాఠశాలల్లోని తరగతి గదులు, మరుగుదొడ్లు, వంట గదులు, తాగునీరు తదితర సదుపాయాల వివరాలు, వాటి స్థితిగతులపై తాజా సమాచారాన్ని పొందుపరుస్తున్నారు.
అక్రమాలకు చెక్
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సర్కారు పరంగా అందుతున్న వసతుల కల్పనకు యూడైస్ ప్లస్‌లోని వివరాలు కీలకం కానున్నాయి. అవినీతికి పాల్పడకుండా ఈ విధానం ఉపయోగపడనున్నది. వెబ్‌సైట్‌లో నమోదైన విద్యార్థులకే ఇకపై యూనిఫాం, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు తదితర వాటిని అందించనున్నారు. అలాగే వసతుల కల్పనకు ప్రభుత్వ పరంగా నిధులు మంజూరు కానున్నాయి.
ప్రతీ విద్యార్థికి నంబర్ కేటాయింపు
యూ డైస్ ప్లస్ పోర్టల్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యాన నడుస్తుంది. ప్రతి ఏడాది అన్ని పాఠశాలల్లో సమగ్ర వివరాలను ప్రధానోపాధ్యాయులు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందులోని ప్రతీ విద్యార్థికి ఒక పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్(పీఈఎన్) కేటా కేటాయిస్తారు. దీని ద్వారా ఆ విద్యార్థి దేశవ్యాప్తంగా ఏఏ పాఠశాలల్లో ఏఏ తరగతులు చదివాడనేది కచ్చితంగా తెలుస్తుంది. పదో తరగతి విద్యార్థి బోర్డు పరీక్షలు రాయాలంటే ఇందులో నమోదై ఉండాల్సిందే.
నమోదు ప్రక్రియ కొనసాగుతోంది..
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. గతంలో ఏడాదికోసారి సమాచారం అప్ డేట్ చేసే అవకాశం ఉండేది. ఇకపై మూడు గంటలకోసారి సాంకేతికత ఆధారంగా సమాచారాన్ని అప్డేట్ చేస్తారు. అలాగే.. యూ డైస్ ప్లస్‌లోని సమాచారం ఆధారంగా ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఈనెల చివరి నాటికి ప్రక్రియ పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాం.
– రాము, జిల్లా విద్యాధికారి
జిల్లాలో అన్ని యజమాన్యాల కింద 662 పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 75,070 మంది విద్యార్థులు ఉన్నారు. జీరో స్కూల్స్ 75 ఉండగా 1 నుంచి 100 మంది ఉన్న పాఠశాలలు 442, 100 కంటే ఎక్కవ మంది విద్యార్థులున్నవి 165 ఉన్నాయి.
మండలం పాఠశాలలు విద్యార్థుల
సంఖ్య
బచ్చన్నపేట 52 4,860
చిల్పూర్ 42 2,906
దేవరుప్పుల 60 4,542
స్టేషన్‌ఘన్‌పూర్ 59 10,534
జనగామ 112 24,288
కొడకండ్ల 42 3,548
లింగాలఽఘణపురం 38 3,403
నర్మెట 40 3,762
పాలకుర్తి 82 7,693
రఘునాథపల్లి 69 4,522
తరిగొప్పుల 24 1,179
జఫర్‌గఢ్ 42 3,833
పాఠశాలల అభివృద్ధికి ‘యూ డైస్ ప్లస్’
దీని ఆధారంగా నిధుల కేటాయింపు
జిల్లాలో 662 ప్రభుత్వ పాఠశాలలు
Comments
Please login to add a commentAdd a comment