ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి
జనగామ: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. ఈ మేరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. హనుమకొండ, హైదరాబాద్ నుంచి జిల్లా కేంద్రంలోకి ప్రవేశించే యశ్వంతాపూర్, పెంబర్తి జంక్షన్ల(టర్నింగ్ పాయింట్)లో స్పీడ్ బ్రేకర్ పాయింట్లు ఏర్పాటు చేయాలని, అలాగే రఘునాథపల్లి ఫ్లై ఓవర్ ఏరియాలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించాలన్నారు. జిల్లా పరిధి ఎన్‌హెచ్ రహదారి పొడవునా, అప్రోచ్‌రోడ్లు, బస్టాప్‌లున్న చోట వాహ న డ్రైవర్లకు అర్థమయ్యేలా సైన్ బోర్డులు, లైటింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రద్దీ ప్రదేశాల్లో సీసీ కెమెరాలు, పాదచారులు రోడ్డు దాటే క్రమంలో ఇబ్బంది లేకుండా జీబ్రా క్రాసింగ్, రోడ్డుపై రిఫ్లెక్టింగ్ లైటింగ్ ఉండేలా చూడాలని ఆదేశించారు. నాలుగు చక్రాల వాహన డ్రైవర్లు సీటు బెల్ట్, ద్విచక్రవాహన చోదకులు హెల్మెట్ తప్పనిసరి ధరించాలని చెప్పారు. మద్యం తాగి వాహనం నడిపినా, మైనర్లకు వాహనం ఇచ్చినా చట్టరీత్యా నేరమ ని స్పష్టం చేశారు. సమీక్షలో ఏసీపీ పార్థసారథి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ పి.సత్యనారాయణరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, టీజీఎన్పీడీసీఎల్ డీఈ లక్ష్మీనారాయణరెడ్డి, ఆర్టీసీ డీఎం స్వాతి, 108 అంబులెన్స్ జిల్లా మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
సర్వే వివరాల నమోదులో తప్పులుండొద్దు
సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే సమయంలో తప్పులు లేకుండా చూడాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. ఆన్‌లైన్ నమోదుపై మాస్టర్ ట్రెయినర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సర్వేలో సేకరించిన వివరాల నమోదును ఈ నెల 22 నుంచి ప్రారంభించాలన్నారు. జిల్లా మాస్టర్ ట్రెయినర్లు మండల స్థాయిలో డేటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ ఇవ్వాలని చెప్పారు.
రిజర్వేషన్ల దామాషాపై అభిప్రాయ సేకరణ
స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాపై బహిరంగ విచారణకు నేడు(గురువా రం) అభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు జిల్లాలోని బీసీ, కుల సంఘాలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ప్రజలు తమ అభిప్రాయాలు, అభ్యర్థనలు, సలహాలు, ఆక్షేపణలను హనుమకొండ కలెక్టరేట్‌లో డెడికేషన్ చైర్మన్ బూపాని వెంకటేశ్వరరావు తదితరులకు అందజేయాలని కోరారు.
సమీక్షలో కలెక్టర్ రిజ్వాన్ బాషా
Comments
Please login to add a commentAdd a comment