ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం
● రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు
పాలకుర్తి టౌన్: సహజ కవి బమ్మెర పోతన జన్మస్థలాన్ని ఆధ్యాత్మిక సాహితీ కేంద్రంగా తీర్చిదిద్దుతా మని పర్యాటక, ఎకై ్సజ్ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం బమ్మెరలోని పోతన స్మృతి వనం, అభివృద్ధి పనులను ఆయన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డతో కలిసి సందర్శించారు. పోతన సమాధి, పోతన వ్యవసాయ క్షేత్రం, బావిని పరిశీలించాక ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. పాలకుర్తి, బమ్మెర, వల్మిడిని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అసంపూర్తిగా ఉన్న పోతన పర్యాటక ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పోత న సమాధి, వ్యవసాయ బావి సమీప వాగుపై చెక్‌డ్యాం.. అలాగే పర్యాటకులకు హరిత హోటల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేసి ఆరు నెలల్లో పోతన స్మృతి వనాన్ని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా తదితరులు పాల్గొన్నారు.
ఏ ఎండకు ఆ గొడుగు.. ఎర్రబెల్లి నైజం
ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నైజం ఎర్రబెల్లి దయాకర్‌రావుది.. ఆయన సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో పదవులు పట్టుకొని పాకులాడిన చరిత్ర దయాకర్‌రావుది అని అన్నారు. ఇక్కడ సరైన ప్రత్యర్థి లేక ఇన్ని రోజులు ఆయన ఆటలు సాగాయని, ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఎర్రబెల్లిని ఓడించి సరైన తీర్పునిచ్చారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment