దళితుల అభ్యున్నతికి సీఎం కృషి
● ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరిగారి ప్రీతమ్
జనగామ: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి దళితుల అభ్యున్నతికి పాటు పడుతున్నారని ఎస్సీ కార్పొరేష న్ చైర్మన్ నగరిగారి ప్రీతమ్ అన్నారు. జిల్లా పర్యట నలో భాగంగా ఆయన బుధవారం ఆర్టీసీ చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 13, 16, 30 వార్డుల్లో ఎన్జీఓ గీతాచార్య ఫౌండేషన్ ఆధ్వర్యాన నిర్వహించి న కుట్టు మిషన్ శిక్షణ తరగతుల సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవీలతతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రీతమ్ మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దళితుల అభివృద్ధి నినాదంతో ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చాక వారిని నట్టేట ముంచిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దళితుల కు పెద్ద పీట వేస్తున్నట్లు చెప్పారు. అనంతరం పలు సమస్యలపై జనగామ మున్సిపల్ ఔట్ సోర్సింగ్ కార్మికులు గంధమాల మల్లేష్, తిప్పారపు ప్రసాద్, గంగారపు కిషన్.. చైర్మన్‌కు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వంగాల కల్యాణి మల్లారెడ్డి, కౌన్సిలర్లు మల్లిగారి చంద్రకళ రాజు, గాదెపాక రామచందర్, బొట్ల శ్రీనివాస్, పార్టీ డాక్టర్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజమౌ ళి, బొట్ల నర్సింగరావు, గణిపాక మహేందర్, మిద్దెపాక స్టాలిన్, గాదెపాక ప్రసాద్, ఎస్సీ సెల్ జాయింట్ కన్వీనర్ మిద్దెపాక సిద్ధులు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మేడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment