తెలంగాణ అభివృద్ధి ప్రదాత మోదీ
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు దశమంత్‌రెడ్డి
జనగామ రూరల్: తెలంగాణ అభివృద్ధి ప్రదాత ప్రధాని మోదీ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి అన్నారు. బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు ఆదరించడాన్ని ఓర్వలేక చిల్లర విమర్శలు చేస్తున్నారని అన్నారు. కాకతీయుల గడ్డ ఓరుగల్లుకు స్మార్ట్ సిటీ, అమృత్, హృదయ్ పథకాలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కాజీపేట వ్యాగన్ పరిశ్రమ, రామప్పకు యూనిస్కో, గిరిజన యూని వర్సిటీ.. ఇవన్నీ ఇచ్చిన మోదీ కాళ్లు కడిగి నీళ్లు తలపై చల్లుకోవాలన్నారు. పేదల ఇళ్లను కూల్చడ మే ఇందిరమ్మ రాజ్యమా అని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డిని విమర్శించే స్థాయి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేదని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లేగ రామ్మోహన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు సౌడ రమేష్, దుబ్బ రాజశేఖర్‌గౌడ్, సభ్య త్వ ప్రముఖ్ కొంతం శ్రీనివాస్, సీనియర్ నాయకులు పెరుమాండ్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment