లింగాలఘణపురం: జీడికల్ శ్రీ వీరాచల రామచంద్రస్వామి ఆలయంలో బుధవారం సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఈ వేడుకను కనులారా తిలకించి పులకించి పోయారు. వరంగల్ ఎంపీ కడి యం కావ్య, ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్ స్వామివారికి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. వేదపండితులు గట్టు శ్రీనివాసాచార్యులు, విజయసారథి, రాఘవాచార్యుల మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణం నిర్వహించారు. కల్యాణోత్సవంలో 31 మంది పుణ్య దంపతులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో అర్చకులు భార్గవాచార్యులు, మురళీకృష్ణమాచార్యులు, రఘురామాచార్యులు, బుచ్చయ్యశర్మ పాల్గొనగా దేవస్థాన చైర్మన్ మూర్తి, స్థానిక ఈఓ వంశీతో పాటు డిప్యూటేషన్‌పై లక్ష్మీప్రసన్న, డీపీఓ స్వరూప, ఆర్డీఓ గోపీరా మ్, తహసీల్దార్ ఆండాలు, ఎంపీడీఓ జలేందర్‌రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏసీపీ భీమ్‌శర్మ, సీఐ శ్రీనివాసురెడ్డి, ఎస్సై శ్రావణ్‌కుమార్, ఎన్‌సీసీ కేడెట్లు భక్తులకు సేవలందించారు. కల్యాణోత్సవ అనంతరం ఎంపీ కావ్య మాట్లాడుతూ మొదటిసారి జీడికల్ సీతారాముల కల్యాణం తిలకించడం ఆనందంగా ఉందన్నారు. ఇప్పటికే రూ.5 లక్షలతో సెంట్ర ల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశామని, వచ్చే ఏడాది లోగా గుట్టపై ఉన్న గుండాల వరకు మెట్లు నిర్మిస్తాన ని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. శ్రీ రామచంద్రస్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. వచ్చే ఏడాది మరింత వేడుకగా కల్యాణం జరిగేలా కృషి చేస్తామన్నారు.
వైభవంగా సీతారాముల కల్యాణం
జీడికల్ వీరాచల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
Comments
Please login to add a commentAdd a comment