రేపు జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

రేపు జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ ఎంపికలు

Published Thu, Nov 21 2024 1:33 AM | Last Updated on Thu, Nov 21 2024 1:33 AM

-

జనగామ రూరల్‌: జిల్లా స్థాయి అథ్లెటి క్స్‌ ఎంపిక పోటీలు 22న ధర్మకంచలోని మినీస్టేడియంలో నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఇక్కడ ఎంపికై న 8, 10, 12 ఏళ్ల బాల బాలికలు డిసెంబర్‌ 1న మంచిర్యాలలో జరిగే రాష్ట్ర స్థాయి కిడ్స్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. క్రీడాకారులు నేడు(గురువారం) ఉదయం 9 గంటలకు జనన ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరా లకు గంగిశెట్టి మనోజ్‌ కుమార్‌(9885046437), ఆవుల అశోక్‌(99124 53220), వంచ చంద్రశేఖర్‌రెడ్డి(77995 52233)ని సంప్రదించాలని కోరారు.

దివ్యాంగులకు రూ.6వేల పింఛన్‌ ఇవ్వాలి

జనగామ రూరల్‌: దివ్యాంగులకు నెలకు రూ.6 వేల పింఛన్‌ ఇవ్వాలని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగళ్ల ఉపేందర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సంఘం ఆధ్వార్యాన బుధవారం కలెక్టరేట్‌ వద్ద రిలే దీక్షలను ప్రారంభించి మాట్లాడారు. పింఛన్‌ పెంచుతామని ఎన్నికల ముందు చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే విస్మరించిందన్నారు. ఈ సమస్యను పరి ష్కరించకుంటే ఈనెల 26న ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. దీక్షలో చిరంజీవి, రాజశేఖర్‌, నర్సయ్య, గడ్డం సందీప్‌, రవి, ప్రశాంత్‌, వెంకటేశ్వర్లు, వంశీ, సిద్ధిరాములు, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement