జనగామ రూరల్: జిల్లా స్థాయి అథ్లెటి క్స్ ఎంపిక పోటీలు 22న ధర్మకంచలోని మినీస్టేడియంలో నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఇక్కడ ఎంపికై న 8, 10, 12 ఏళ్ల బాల బాలికలు డిసెంబర్ 1న మంచిర్యాలలో జరిగే రాష్ట్ర స్థాయి కిడ్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. క్రీడాకారులు నేడు(గురువారం) ఉదయం 9 గంటలకు జనన ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరా లకు గంగిశెట్టి మనోజ్ కుమార్(9885046437), ఆవుల అశోక్(99124 53220), వంచ చంద్రశేఖర్రెడ్డి(77995 52233)ని సంప్రదించాలని కోరారు.
దివ్యాంగులకు రూ.6వేల పింఛన్ ఇవ్వాలి
జనగామ రూరల్: దివ్యాంగులకు నెలకు రూ.6 వేల పింఛన్ ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగళ్ల ఉపేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సంఘం ఆధ్వార్యాన బుధవారం కలెక్టరేట్ వద్ద రిలే దీక్షలను ప్రారంభించి మాట్లాడారు. పింఛన్ పెంచుతామని ఎన్నికల ముందు చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విస్మరించిందన్నారు. ఈ సమస్యను పరి ష్కరించకుంటే ఈనెల 26న ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. దీక్షలో చిరంజీవి, రాజశేఖర్, నర్సయ్య, గడ్డం సందీప్, రవి, ప్రశాంత్, వెంకటేశ్వర్లు, వంశీ, సిద్ధిరాములు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment