తీరని సమస్యలు
జనగామ రూరల్: అర్జీలు పట్టుకుని అధికారుల వద్దకు తిరగడమే తప్ప సమస్యలు తీరడంలేదంటూ ప్రజలు వాపోతున్నారు. కలెక్టరేట్‌లో సోమవా రం నిర్వహించిన గ్రీవెన్స్‌కు వివిధ సమస్యలపై 76 వినతులు రాగా.. వాటిని కలెక్టర్ రిజ్వాన్ బాషా, ఆర్డీఓ వెంకన్నతో కలిసి స్వీకరించారు. దరఖాస్తుల ను పరిశీలించి సమస్యలు సత్వరమే పరిష్కరించాల ని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ధరణి పెండింగ్ దరఖాస్తుల్లో అన్ని మాడ్యూల్స్ పూర్తిచేయాలని, మండల స్థాయిలో ప్రజావాణి సక్రమంగా నిర్వహించి వినతులు పెండింగ్‌లో లేకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు. కుల, ఆదా య, ఈబీసీ, మ్యారేజ్ తదితర ధ్రువీకరణ పత్రాల జారీ వేగవంతం చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమాన్ నాయక్, జెడ్పీ డిప్యూటీ సీఈఓ సరిత, డీఆర్‌డీఓ వసంత, డీఏఓ రామారావు నాయక్, డీఎం సీఎస్ హతీరాం, డీసీఎస్‌ఓ సరస్వతి, డీడబ్ల్యూఓ ఫ్లోరెన్స్ తదితరులు పాల్గొన్నారు.
అర్జీల్లో కొన్ని ఇలా..
● రెవెన్యూ శాఖకు సంబంధించి ధరణి పోర్టల్‌లో తన భూమి 4.20 ఎకరాలకు 2.16 ఎకరాలుగా నమోదైంది. మిగతా రెండెకరాలు ధరణిలో నమోదు చేయాలని దేవరుప్పుల మండలం కామారెడ్డి గూడెంకు చెందిన దండు సోమయ్య దరఖాస్తు ఇచ్చారు.
● ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకో నందున తనకు తెల్ల రేషన్ కార్డు మంజూరు చేయాలని కోరుతూ జిల్లా కేంద్రం సంజయ్ నగర్‌కు చెందిన ఉషా జాటవ్ అర్జీ పెట్టుకున్నారు.
● అద్దెకు ఉంటున్న తాను ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద దరఖాస్తు చేసుకోగా పేరు రాలేదని, పరిశీ లించి నమోదు చేయలని జనగామ మున్సిపల్ పరిధి రెండో వార్డుకు చెందిన లగిశెట్టి సునీత వినతిపత్రం ఇచ్చారు.
● మా తాత పేరు మీద ఉన్న 1.30 గుంటల భూమిని వారసత్వ ఆస్తిగా తమ పేరుమీదకు మార్చాలని బచ్చన్నపేట మండలం అలీంపూర్ గ్రామానికి చెందిన పాకాల నర్సయ్య, కనకయ్య విజ్ఞాపన పత్రం ఇచ్చారు.
● కొడకండ్ల మండలం రామవరం గ్రామానికి చెందిన మచ్చ సునీత.. తన ఒక ఎకరం గుంట భూమికి సంబంధించి యాజమాన్యపు హక్కు పత్రం కొత్తది జారీ చేయాలని కలెక్టర్‌కు దరఖా స్తు అందజేశారు.
పై ఫొటోలో కనిపిస్తున్న అమంచ అఖిల, నిఖిల మానసిక దివ్యాంగులు. పట్టణంలోని గుండ్లగడ్డకు చెందిన వీరి తండ్రి ఇంటి నుంచి వెల్లిపోగా తల్లి రమాదేవి బీడీలు చుట్టి పిల్లల ను పోషించుకుంటోంది. నిలువ నీడలేదు. అద్దె ఇంట్లో ఉంటూ పింఛన్ డబ్బులతో నెట్టుకు వస్తున్నది. ఆర్థిక ఇబ్బందులతో అద్దె కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ‘తమకు డబు ల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాల ని’ రమాదేవి కలెక్టర్‌ను వేడుకుంది.
గ్రీవెన్స్‌కు 76 వినతులు
తిరగడమే తప్ప తీర్చేది లేదా.. అంటూ
అర్జీదారుల ఆవేదన
దరఖాస్తులను సత్వరమే
పరిష్కరించాలి : కలెక్టర్ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment