రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
దేవరుప్పుల: మండల కేంద్రంలోని బాలయేసు ఇంగ్లిష్ మీడియం హైస్కూల్‌కు చెందిన 5వ తరగతి విద్యార్థిని కై రంకొండ సహస్ర చెస్ సబ్‌జూనియర్ స్టేట్ మీట్‌కు ఎంపికై నట్టు కరస్పాండెంట్ బ్రదర్ జేసురాజు తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన సీఎం కప్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన సహస్ర జిల్లా కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్‌చే ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. స్టేట్‌మీట్‌కు పోయేలా ప్రోత్సహించిన తల్లిదండ్రులు కై రంకొండ లావణ్య, రాములుతోపాటు ఉపాధ్యాయులను పాఠశాల యాజమాన్యం ప్రతనిధి బ్రదర్ ఇరుదయరాజ్ అభినందించారు.
చిన్నపెండ్యాల విద్యార్థులు..
చిల్పూరు: ఇటీవల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీల్లో మండలంలోని చిన్నపెండ్యాల ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను సోమవారం హెచ్‌ఎం గుడిమల్ల సంపత్ ఆధ్వర్యంలో అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment