జాతీయ గణిత దినోత్సవం
జనగామ: లయన్స్ క్లబ్ జనగామ మిలీనియం ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో మిలీనియం అధ్యక్షుడు నర్సింహులు, ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో సోమవారం జాతీయ గణిత దినోత్సవ వేడుకలను నిర్వహించారు. విద్యార్థులకు గణిత రంగోలి, క్విజ్ తదితర పోటీలు నిర్వహించారు. క్లబ్ రీజినల్ చైర్మన్ చందుపట్ల రవీందర్‌రెడ్డి, పూర్వ రీజినల్ చైర్మన్ శ్రీరాం శ్రీనివాస్, జోన్ చైర్మన్ రంగరాజు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ నిత్య జీవితంలో గణితం ప్రాముఖ్యత ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు. పోటీల్లో విజేతలకు బహుమతులను అందించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ న ర్సింహులు, రవీందర్, గణిత ఉపాధ్యాయులు ముదిగొండ రాణి, క్లబ్ కో శాధికారి బండ భిక్షపతి, పూర్వ అధ్యక్షులు కాముని శ్రీనివాస బాబు, బైరు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఏకశిల పబ్లిక్ స్కూల్‌లో..
జిల్లా కేంద్రం హైదరాబాద్ రోడ్డులోని ఏకశిల పబ్లిక్ స్కూల్‌లో జాతీయ గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెడల్స్‌తో పాటు సర్టిఫికెట్లను అందించారు. పాఠశాల సెక్రెటరీ చిర్ర ఉపేందర్‌రెడ్డి, గణిత ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కూనూర్ పాఠశాలలో..
జఫర్‌గఢ్: గణిత దినోత్సవాన్ని మండలంలోని కూనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ నివాసి ముచ్చా భాస్కర్‌రెడ్డి రూ.10 వేల విలువ చేసే గణిత రెఫరెన్స్ పుస్తకాలను పాఠశాల గ్రంథాలయానికి అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు .. దాత భాస్కర్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు గణిత పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment