బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం..
● మండల విద్యాధికారి జి.కళావతి
దేవరుప్పుల: రోడ్డు ప్రమాదంలో అకాల మరణం పొందిన మరిపెల్లి యాకయ్య కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని మండల విద్యాధికారి గుంటుపల్లి కళావతి అన్నారు. సోమవారం మండలంలోని కామారెడ్డిగూడెంలో ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగి యాకయ్య చిత్రపటానికి ఆమెతోపాటు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పూలమాల వేసి నవాళులర్పించారు. విద్యాశాఖ, పలు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల సహకారంతో సేకరించిన మొత్తం రూ.1,42,200 లను కుటుంబ సభ్యులైన వాణికి అందజేశారు. అలాగే సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా బాధ్యులు తాడూరి రమేశ్ ఆధ్వర్యంలో రూ. 20 వేల సాయం అందించి ఓదార్చారు. విద్యాశాఖ అంత్యక్రియల కింద మరో రూ.15 వేలు అందించినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి సిహెచ్ ఉపేందర్, కోల్కొండ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు విష్ణు, ఆయా ఉపాధ్యాయ సంఘాల మండల బాధ్యులు, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా బాధ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment