బాలయేసు హైస్కూల్‌కు విశిష్ట పురస్కారం
దేవరుప్పుల: మండల కేంద్రంలోని బాలయేసు ఇంగ్లిష్ మీడియం హైస్కూల్‌కు బ్రెయిన్‌పీడ్ సంస్థ ఆధ్వర్యంలో ఈటీ టెక్ ట్రైబ్లేజర్ స్కూల్ ఆఫ్ ది ఇయర్ 2024–25 సంవత్సరానికిగాను తలపెట్టిన విశిష్ట పురస్కారం లభించింది. ఈ నెల 6,7 వ తేదీల్లో హైదరాబాద్ హైటెక్స్ వేదికగా బ్రేయిన్‌పీడ్ సంస్థ రాష్ట్రంలోని పలు పాఠశాలలకు ఎక్సలెన్స్ ఇన్ ఇన్‌స్పిరేషనల్ లీడర్ షిప్, ఇన్నోవేటివ్ ప్రాక్టీస్, బెస్ట్ అకాడమీ ఎక్సలెన్స్ స్కూల్ విభాగాల కింద రికార్డుల ప్రతిభపాటవపోటీలకు ఆహ్వానం పలికింది. ఈ మేరకు బాలయేసు హైస్కూల్ విద్యార్థులు పాఠశాల విద్య. ఇన్నోవేషన్, నాయకత్వంలో తమకంటూ ప్రత్యేకతను చాటారు. విద్యాబోధనతోపాటు పలు రంగాల్లో విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసేందుకు తోడ్పాటు అందిస్తున్న బాలయేసు స్ఫూర్తిని విశదీకరించారు. దీంతో తెలంగాణలోని టాప్20 ఉన్నత పాఠశాలలకు ప్రత్యేక గుర్తింపు సరసన బాలయేసు హైస్కూల్ చేరడం పట్ల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఈ పాఠశాల పురస్కారాన్ని పూర్వ విద్యార్థి జోగు క్రాంతికుమార్ అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ బ్రదర్ జేసురాజు మాట్లాడుతూ బ్రెయిన్‌పీడ్ పురస్కారాన్ని పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులకు అంకితం చేస్తూ భవిష్యత్‌లో మరింత సమగ్ర విద్యావికాసానికి తోడ్పాటు అందిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment