సీజేఐటీలో సెమీ క్రిస్మస్ సంబురాలు
జనగామ: మండలంలోని యశ్వంతాపూర్ క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల డైరెక్టర్ ఫాదర్ డి.విజయాపాల్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. కళాశాల అధ్యాపక, ఆచార్యులు, విద్యార్థుల ఆధ్వర్యంలో క్రిస్మస్ పండగ విశిష్టతను తెలియజేసే విధంగా సంబురాలను జరుపుకున్నారు. యేసుక్రీస్తు జన్మవృత్తాంతాన్ని కళ్లకు కట్టినట్లు విద్యార్థులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ ఫాదర్ డి.విజయపాల్‌రెడ్డి మట్లాడుతూ దేవున్ని స్మరింస్తూ, ప్రేమను పంచడం ద్వారా శాంతి, సోదరభా వం పెంపొందుతుందన్నారు. పారిస్ ఫాదర్ ఇన్నారెడ్డి మాట్లాడుతూ ప్రేమను పంచడం క్రిస్మస్ పండగ ఉద్దేశమన్నారు. గౌరవ అతిథులు, పూర్వ కళాశాల డైరెక్టర్ టి.అగస్టీన్‌రెడ్డి మాట్లాడుతూ అద్భుతమైన ప్రకృతిని ధ్వంసం చేస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ ఏసుక్రీస్తు మార్గంలో నడిచి సమా జ శ్రేయస్సుకు పాటు పడాలన్నారు. అనంతరం క్రిస్మస్ కేక్‌కట్ చేశారు. ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేకర్‌రెడ్డి, కో ఆర్డినేటర్ కరుణాకర్, సరిత, సంతోష కుమారి, స్వప్న, అధ్యాపకులు, విద్యార్థులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment