‘రైతు బాంధవుడు సీఎం రేవంత్‌రెడ్డి’
స్టేషన్‌ఘన్‌పూర్: రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి రైతుల పక్షపాతిగా, రైతు బాంధవుడిగా పనిచేస్తున్నారని స్టేషన్‌ఘన్‌పూర్ వ్యవసాయ మార్కెట్ చైర్‌పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్‌రెడ్డి అన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో జాతీయ రైతు దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి చైర్‌పర్సన్ ముందుగా రైతులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం రైతులకు స్వీట్లు పంపిణీ చేసి సంబురాలు జరుపుకున్నారు. సెక్రటరీ భాస్కర్, మార్కెట్ వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు మాచర్ల కుమారస్వామి, వసంత్, మంతెన ఇంద్రారెడ్డి, చింత ఎల్లయ్య, సింగపురం వెంకటయ్య, గోలి శ్రీను, రాంరెడ్డి పాల్గొన్నారు.
బాలికలు అన్నిరంగాల్లో రాణించాలి
● జీసీడీఓ గౌసియా
నర్మెట: బాలికలు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి అన్నిరంగాల్లో రాణించాలని గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ గౌసియా అన్నారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సోమవారం విద్యార్థినులకు దుప్పట్ల పంపిణి చేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు. పదిలో పదికిపది జీపీఏ సాధించి వంద శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఏఎంఓ శ్రీనివాస్, సీఎంఓ నర్సింగా రావు, ఎంఈఓ ఐలయ్య, ఎస్‌ఓ బైరోజు రజత, కార్యదర్శి రిజ్వాన్, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
దుప్పట్లు పంపిణీ
జనగామ రూరల్: మండలంలోని చౌడారం కేజీబీవీ విద్యార్థులకు ఎంపీడీఓ సంపత్‌కుమార్ దుప్పట్లు అందజేశారు. మండల విద్యాధికారి రాజేందర్, పంచాయతీ సెక్రెటరి రాజు తదితరులు పాల్గొన్నారు.
స్టేషనరీ అందజేత
జనగామ: పట్టణంలోని వీవర్స్ కాలనీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కో ఆపరేటివ్ గ్రూప్స్ హెచ్‌ఆర్ మేనేజర్ వెన్నెసా, తెలంగాణ ప్రతినిధి టి.శ్రీధర్, సభ్యుల సహకారంతో విద్యార్థులకు స్కూల్ బెల్ట్‌లు, టైలు, నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, ఇతర స్టేషనరీతోపాటు పండ్లు అందజేశారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గుర్రం భూలక్ష్మీనాగరాజు, కృష్ణ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
స్టడీ మెటీరియల్..
నర్మెట: విద్యార్థులు శ్రద్ధతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని లయన్స్ క్లబ్ జనగామ బి బాయ్స్ అధ్యక్షుడు శివశంకర్‌రావు అన్నారు. అమ్మాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆల్‌ఇన్ వన్ స్టడీ మెటీరియల్, పరీక్షాప్యాడ్‌లను ఆయన సోమవారం పంపిణీ చేసి మాట్లాడారు. వ్యవస్థాపక అధ్యక్షుడు బి. బాల భరద్వాజ్, బాకృష్ణ, అనిల్ కుమార్ ఉన్నారు.
గోవర్దనగిరిలో..
రఘునాథపల్లి: లయన్స్ క్లబ్ ఆఫ్ హనుమకొండ ట్రైసిటీ ఆధ్వర్యంలో మండలంలోని గోవర్దనగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు సోమవారం స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం వెంకటేశ్వర్లు, క్లబ్ అధ్యక్షుడు పెట్లోజు సురేష్‌బాబు, దాత లయన్స్ పుట్ట హరికిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పుస్తకాల వితరణ
రఘునాథపల్లి: ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ యునైటెడ్ కింగ్‌డమ్ లండన్ సౌజన్యంతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ హైదరాబాద్ వారు మండలంలోని ఖిలాషాపూర్ ఉన్నత పాఠశాలకు సోమవారం పుస్తకాలు వితరణ చేశారు. సంస్థ లోకల్ ప్రతినిధులు బండి చైతన్య కిషోర్, ఉప్పుల రవి, చింత బాలయ్యలు రూ.30 వేల విలువైన సైన్స్, సోషల్, జనరల్ నాలెడ్జ్, తత్వ శాస్త్రాలకు సంబంధించిన పుస్తకాలతో పాటు, రూ 10 వేల బీరువాను పాఠశాల హెచ్‌ఎం డాక్టర్ భారత రవీందర్‌కు అందజేశారు. సమన్వయకర్త శాగ నర్సయ్య, ఉపాధ్యాయులు శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి, మల్లేష్, శ్రీకాంత్, కళావతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment