విద్యారంగ పరిరక్షణకు యూటీఎఫ్ కృషి
జఫర్‌గఢ్/కొడకండ్ల/పాలకుర్తి టౌన్: ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణతో పాటు ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం టీఎస్ యూటీఎఫ్ కృషి చేస్తుందని సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మంగు జయప్రకాశ్ అన్నారు. మండలంలోని హిమ్మత్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల నల్లగొండలో 28,29,30 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్ర మహాసభల వాల్‌పొస్టర్లను నాయకులు, ఉపాధ్యాయులతో కలిసి ఆయన సోమవారం ఆవిష్కరించారు. సంఘం మండల శాఖ అధ్యక్షుడు భూక్య వంశీకృష్ణ, ఉపాధ్యాయులు జితేందర్, కవిత, వనజాత పాల్గొన్నారు. అలాగే కొడకండ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో మహాసభలకు సంబంధించిన పోస్టర్లను సంఘం జిల్లా కార్యదర్శి పత్తి వెంకటాద్రి ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో పీఎస్ హెచ్‌ఎం ప్రభాకర్, సంఘ నాయకులు సోమయ్య, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, పాలకుర్తిలో సంఘం మహాసభల పోస్టర్లను విద్యాశాఖ అధికారి పోతుగంటి నర్సయ్య ఆవిష్కరించారు.
పీవీ నర్సింహారావుకు
ఘన నివాళి
పాలకుర్తి టౌన్/కొడకండ్ల: దేశంలో ఆర్ధిక సంస్కరణలను ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి మాజీ భారత ప్రధాని పీవీ నర్సింహారావు దేశానికి ఆదర్శమని కాంగ్రెస్ నాయకులు అన్నారు. పాలకుర్తి, కొడకండ్ల మండల కేంద్రాల్లోని పార్టీ కార్యాలయాల్లో పీవీ నరసింహారావు వర్థంతిని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయా కార్యక్రమాల్లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ , నాయకులు మార్కెట్ చైర్‌పర్సన్ మంజుల, కుమారస్వామి, మసురం రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల్లో కమలం పార్టీ
వికసించాలి
● పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌గౌడ్
దేవరుప్పుల: గ్రామాల్లో ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపర్చేలా కమలం పార్టీ వికసించేలా కమిటీలు తోడ్పాటు అందించాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బ రాజశేఖర్‌గౌడ్ అన్నారు. సోమవారం మండలంలోని పెద్దమడూర్, అప్పిరెడ్డిపల్లి, రామచంద్రపురం గ్రామాల్లో పార్టీ మండల అధ్యక్షుడు కాసాని సత్యనారాయణ అధ్యక్షతన బూత్ కమిటీ అధ్యక్షులను నియమించారు. ఓడపల్లి సోమన్న, భాగాల నవీన్ రెడ్డి, పెద్దగౌని రాజు, సందీప్, దినేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment