క్రిస్మస్ సందడి
● ముస్తాబైన ప్రార్థనా మందిరాలు
లోక రక్షకుడు.. ఏసుక్రీస్తు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు జిల్లాలోని క్రైస్తవులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నెల 25న క్రిస్‌మస్ పండుగను పురస్కరించుకుని ప్రార్థనా మందిరాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇళ్ల ఎదుట నక్షత్రాలు, ఇళ్లలో క్రిస్‌మస్ ట్రీలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆరాధకులు సంబురాలను ప్రారంభించారు. నృత్యాలు, శాంతి సందేశాలు, ప్రేమ సూక్తులు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. శాంతా క్లాజ్, మేరీమాత బొమ్మలతోపాటు స్టార్లు, ట్రీలు, విద్యుత్ దీపాలు తదితర కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఫ్యాన్సీ స్టోర్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. – జనగామ
Comments
Please login to add a commentAdd a comment