భయం భయంగా..
అడవుల్లో పెద్దపులి సంచారం
● జాడ గుర్తించని అటవీ అధికారులు
● జంకుతున్న పశువుల కాపరులు
● గిరిజన గ్రామాల్లో ప్రజల ఆందోళన
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ముగులు జిల్లా ఎస్‌ఎస్‌తాడ్వా యి మండల పరిధి అటవీ ప్రాంతాల గిరిజన ప్రజలను పెద్దపులి భయం వేటాడుతోంది. వారం రోజుల నుంచి అడవుల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు దాని పాదముద్రల ద్వారా అటవీశాఖ అధికారులు గుర్తించారు. తొలుత పంబాపూర్, నర్సాపూర్ అట వీ ప్రాంతంలో సంచరించినట్లు గుర్తించిన అధికారులు రెండు రోజుల క్రితం బంధాల, లింగాల అటవీ ప్రాంతంలో తిరిగినట్లు పాదముద్రలను గుర్తించా రు. పులి జాడ కోసం వెతుకుతున్నారు. బంధాల అడవుల్లో పులి సంచరిస్తున్నదా.. ఎటువైపు వెళ్లింద నే కోణంలో అన్వేషిస్తున్నారు. సోమవారం రంగా పూర్, బీరెల్లి, గంగారం, లింగాల, బంధాల అటవీ ప్రాంతాల్లో టీంల వారీగా పెద్దపులి ఆచూకీ కోసం గాలించినా పాదముద్రలు లభించలేదని రేంజ్ అధికారి కోట సత్తయ్య తెలిపారు.
అధికారులకు తలనొప్పిగా..
అటవీశాఖ అధికారులకు పెద్దపులి సంచారం తలనొప్పిగా మారింది. కొద్ది రోజులుగా పులి జాడ కోసం అధికారులు టీంలుగా ఏర్పడి అటవీ ప్రాంతంలో గాలిస్తున్నారు. మండలంలోనే పులి సంచరి స్తున్నట్లు పాదముద్రలను గుర్తించిన అధికారులు తిరిగి తాడ్వాయి అడవుల నుంచి ఎక్కడికి వెళ్లిందనే విషయాన్ని తెలుసుకునేందుకు ఫారెస్ట్‌లో తిరుగుతున్నారు. రెండు రోజుల క్రితం బంధాల, లింగాల అటవీ ప్రాంతంలో పులి అడుగులను గుర్తించారు. అయితే.. పులి ఎక్కడికి వెళ్లిందనే ఆనవాళ్లు లభించకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ఫారెస్ట్ అధికారులు పులి పాదముద్రల ను గుర్తించడంతో అటవీ ఉత్పత్తుల సేకరణకు అడవికి వెళ్లేందుకు గిరిజనులు జంకుతున్నారు. అడవి సమీప గ్రామాల ప్రజలు రాత్రి సమయాల్లో పులి వస్తుందని భయపడుతున్నారు. దీంతో పలువురు పశువుల కాపారులు అడవికి వెళ్లడం లేదు. యజ మానులే ఇంటి దగ్గర వాటిని కట్టేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment