సంక్రాంతి వరకు సాగు నీరు అందించాలి
జనగామ రూరల్: సంక్రాంతి నాటికి ఘనపూర్ నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధి కారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ రిజ్వాన్ బాషాతో కలిసి కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలోని దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు కింద భూసేకరణ ప్రక్రియ సత్వరమే పూర్తి చేయాలని, యాసంగి పంటలకు అన్ని రిజర్వాయర్ల కింద ఉన్న చెరువుల్లో నీటిని నింపాలని చెప్పారు. జలవనరు ల్లోని గుర్రపు డెక్క, చెత్తా చెదారం తొలగించాలని అన్నారు. అశ్వరావుపల్లి రైట్ మెయిన్ కెనాల్, ధర్మసాగర్, నవాబుపేట, ఉప్పుగల్లు తదితర కెనాల్ పనులు త్వరగా పూర్తిచేయాలన్నారు. అధికారులు మెయింటనెన్స్, నీటి నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో గ్రంథాల య సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య రెడ్డి, ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమాన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
సర్వే వేగవంతం చేయాలి : కలెక్టర్
జనగామ: జిల్లాలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో స్టేషన్‌ఘన్‌పూర్ ఆర్డీఓ వెంకన్నతో కలిసి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రత్యేక అధికా రులు పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓలను సయమన్వయం చేసుకుని విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. అలాగే కలెక్టరేట్ ఏరియాతో పాటు ఫ్లోర్స్, శాఖల వారీగా చాంబర్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సమీక్షలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుహాసి ని, హనుమాన్‌నాయక్, జెడ్పీ డిప్యూటీ సీఈఓ సరిత, డీఆర్‌డీఓ వసంత, డీఏఓ రామారావు నాయక్, డీఎం సీఎస్ హతీరాం, డీసీఎస్‌ఓ సరస్వ తి, డీడబ్ల్యూఓ ఫ్లోరెన్స్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి
Comments
Please login to add a commentAdd a comment