వేగంగా వెళ్తున్నారా.. జాగ్రత్త!
రఘునాథపల్లి: మండలంలోని నిడిగొండ వద్ద బైపాస్ రహదారిపై ప్రమాదాల నియంత్రణకు భారత జాతీయ రహదారుల అథారిటీ(ఎన్‌హెచ్‌ఏఐ) చర్యలు చేపట్టింది. నిడిగొండ పెట్రోల్ బంక్ సమీప క్రాసింగ్ వద్ద స్పీడో మీటర్ ఏర్పాటు చేశారు. బైపాస్ రహదారిపై పరిమిత వేగం గంటకు 80 కిలో మీటర్లు.. అంతకంటే ఎక్కువ స్పీడుతో వెళ్లే వాహనాలకు ఆటోమెటిక్‌గా ఫెనాల్టీ పడుతుంది. వాహనదారులు అతివేగంగా వెళ్తుండడంతో నిడిగొండ వద్ద తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పలువురు ప్రాణాలు కొల్పోగా.. అనేక మంది క్షతగాత్రులయ్యారు. ఈ నేపథ్యంలో ప్రమాదాలకు చెక్ పెట్టేలా వాహనాల వేగ నియంత్రణకు చర్యలకు ఉపక్రమించారు. ఈ మార్గంలో వెళ్లే వారు నిర్ణీత వేగం దాటితే జరిమానా తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిడిగొండ గ్రామస్తులు మాత్రం.. ఇక్కడ అండర్‌పాస్ నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.
నిడిగొండ వద్ద స్పీడో మీటర్
ప్రమాదాల నియంత్రణకు ఏర్పాటు
Comments
Please login to add a commentAdd a comment