అర్హత లేకున్నా వైద్యసేవలు..
రఘునాథపల్లి: కంచనపల్లికి చెందిన ఈశ్వరయ్య అనే వ్యక్తి అర్హత లేకపోయినా గ్రామంలో వైద్య సేవలు అందిస్తూ అల్లోపతి మందులను నిల్వ చేశాడు. పక్కా సమాచారంతో జనగామ, వరంగల్ జిల్లాల ఔషధ నియంత్రణ అధికారులు ఏలె బాలకృష్ణ, అరవింద్ క్లినిక్‌పై సోమవారం దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ చేసిన రూ.25వేల విలువై న 40 రకాల అల్లోపతి మందులను సీజ్ చేశారు. వాటిని జనగామ కోర్టులో జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ముందు సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు. అర్హత లేని వైద్యునిపై సెక్షన్ 18సీ డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్ 1940 ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. డ్రగ్స్ లైసెన్స్ లేకుండా మందులు నిల్వ ఉంచితే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఔషధ నియంత్రణ శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ రాజ్యలక్ష్మి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ దాడుల్లో రఘునాథపల్లి పీహెచ్‌సీ హెల్త్ అసిస్టెంట్లు విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీహెచ్‌ఏ కె.రాణి పాల్గొన్నారు.
కంచనపల్లిలో క్లినిక్‌పై దాడులు
40 రకాల మందులు స్వాధీనం
నిర్వాహకుడిపై క్రిమినల్ కేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment