ఎర్త్ ఫౌండేషన్ సేవలు విద్యార్థులకు వరం
జనగామ: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎర్త్ ఫౌండేషన్ ద్వారా అందించనున్న సేవలు వరంగా మారుతాయని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం రైల్వేస్టేషన్ ఏరియా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎర్త్ ఫౌండేషన్ స్కిల్స్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో చదువుకుంటున్న వెయ్యి మంది విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్, సైన్స్ ఆన్ వీల్స్, మోటివేష న్ తరగతులు, ఆటల్లో శిక్షణ అందిచనున్నట్లు పేర్కొన్న ఎమ్మెల్యే.. శ్రద్ధగా నేర్చుకోవాలని సూచించారు. ఈ సేవలను జిల్లాలోని మరిన్ని పాఠశాలలకు విస్తరించేలా చూడాలన్నారు. ఫౌండేషన్ డైరెక్ట ర్ మంగళ్లపల్లి రాజు మాట్లాడుతూ విద్యార్థులకు ఉచితంగా సేవలందించే విషయంలో ఎమ్మెల్యే ప్రోత్సాహం మరువలేమని, రాబోయే రోజుల్లో సేవలను విస్తృతం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం కృష్ణమూర్తి, ఫౌండేషన్ కోఆర్డినేటర్ బి.ఆంజనేయులు, తుంగ కౌశిక్, కౌన్సిలర్లు ముస్త్యాల దయాకర్, తాళ్ల సురేష్‌రెడ్డి, ఉల్లెంగుల సందీప్, గుర్రం నాగరాజు, యాకూబ్, దేవునూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment