సంక్షిప్త సమాచారం | - | Sakshi
Sakshi News home page

సంక్షిప్త సమాచారం

Published Tue, Dec 24 2024 7:47 AM | Last Updated on Tue, Dec 24 2024 7:47 AM

-

పరామర్శ

జనగామ: పట్టణంలోని కృష్ణ కళామందిర్‌ ఏరియాకు చెందిన మున్సిపల్‌ శానిటేషన్‌ కార్మికుడు తోకల యాదగిరి గుండెపోటుతో మృతిచెందాడు. కాగా, సోమవారం ఎమ్మెల్యే డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. మృతదేహంపై పుష్పగుచ్ఛం వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకల జమునలింగయ్య, ఫ్లోర్‌ లీడర్‌ గాడిపెల్లి ప్రే మలతరెడ్డి, మున్సిపల్‌ డ్రైవర్ల యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు పానుగంటి ప్రవీణ్‌, నాయకులు తదితరులు ఉన్నారు.

వ్యాపార వేత్త కుటుంబానికి..

పట్టణంలోని 18వార్డుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రేణుకుంట నాగభూషణం మృతి చెందగా, ఎమ్మెల్యే డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇంటికి వెళ్లి కుటుం బాన్ని పరామర్శించారు. మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

పోగొట్టుకున్న గొలుసు అప్పగింత

జనగామ: జనగామ డిపో బస్సులో ప్రయాణిస్తూ బంగారు గొలుసు పోగొట్టుకున్న ప్రయాణికురాలికి అప్పగించినట్లు సోమవారం మేనేజర్‌ స్వాతి తెలిపారు. హనుమకొండ నుంచి జనగామకు బస్సులో ఓ ప్రయాణికురాలి మెడలోని 17 గ్రాముల బంగారు గొలుసు జారిపోయినట్లు తెలిపారు. సీటువద్ద పడిపోయిన గొలుసు మరో ప్రయాణికురాలికి దొరకగా, కండక్టర్‌ సంధ్యారాణి తీసుకుని డిపోలో అప్పగించినట్లు వివరించారు. బాధిత ప్రయాణికురాలిని పిలిపించి బంగారు గొలుసును డీఎం స్వాతి అప్పగించారు. దీంతో ఆమె సంతోషం వ్యక్తం చేసి, కండక్టర్‌, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. మేనేజర్‌ వెంట డిపో అసిస్టెంట్‌ మేనేజర్‌(ట్రాఫిక్‌) డి.హుస్సేన్‌, ఏడీసీ టీబీఎస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

రెండు రోజులు సీసీఐ పత్తి కొనుగోళ్లు బంద్‌

స్టేషన్‌ఘన్‌పూర్‌: ఘన్‌పూర్‌ వ్యవసాయ మార్కెట్‌ పరిఽధిలోని రాజవరంలోని సిరి కాటన్‌ ఇండస్ట్రీస్‌, శివునిపల్లి శివసాయి కాటన్‌ ఇండస్ట్రీస్‌లలో ఈనెల 25, 26వ తేదీల్లో సీసీఐ పత్తి కొనుగోళ్లు బంద్‌ చేస్తున్నట్లు చైర్‌పర్సన్‌ లావణ్యశిరీష్‌రెడ్డి, సెక్రటరీ భాస్కర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25న క్రిస్మస్‌, 26న బాక్సింగ్‌ డే సందర్భంగా సెలవులు ఉంటాయని, రైతులు గమనించి సహకరించాలని కోరారు.

మొక్కలను సంరక్షించాలి

జఫర్‌గఢ్‌: మొక్కలను నాటడంతోపాటు వాటిని సంరక్షించాలని డాక్టర్‌ విష్ణు, శ్రావ్య అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక అరోగ్య కేంద్రం ఎదుట సోషల్‌ వర్కర్‌, కానిస్టేబుల్‌ రవీందర్‌ ఆధ్వర్యంలో ఇటీవల బదిలీపై వెళ్లిన ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్‌ విష్ణు, విధుల్లో చేరిన డాక్టర్‌ శ్రావ్య సోమవారం మొక్కలు నాటారు. వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

వాల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

నర్మెట: జిల్లా కేంద్రంలో ఈనెల 29న నిర్వహించనున్న తెలంగాణ రజక రిజర్వేషన్‌ రాష్ట్ర మూడో మహాసభ సందర్భంగా మండలకేంద్రంలోని రజక భవన్‌లో సోమవారం వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. టీఆర్‌ఆర్‌ఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిన్నలాపురం జలంధర్‌, జిల్లా అధ్యక్షుడు నరేష్‌, మండల అధ్యక్షుడు అంజయ్య, నాయకులు ఉన్నారు.

‘డీలర్‌షిప్‌ను రద్దు చేయాలి’

జనగామ రూరల్‌: గ్యాస్‌ సిలిండర్‌ సరఫరా సమయంలో డీజిల్‌ చార్జి పేరిట అదనపు వసూలు చేస్తున్న పెంబర్తిలోని శ్రీ అయ్యప్ప ఇండెన్‌ ఏజెన్సీ డీలర్‌షిప్‌ను రద్దు చేయాలని యాసారపు కర్నాకర్‌ కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌కు వినతి పత్రం అదజేశారు.

వివక్ష లేకుండా వ్యవహరించాలి

లింగాలఘణపురం: ఆడ,మగ పిల్లలు అను వివక్ష లేకుండా తల్లితండ్రులు వ్యవహరించాలని, నేడు అన్ని రంగాల్లో మహిళలు పురుషులతో సమానంగా రాణిస్తున్నారని ఎంపీడీఓ జలేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని శుభాంజలి మండల సమాఖ్యలో కలెక్టర్‌ ఆదేశాల మేరకు నయి చేత్న 3.0 జాతీయ కార్యక్రమంలో భాగంగా లింగ వివక్ష వ్యతిరేక అవగాహన సమావేశాన్ని నిర్వహించారు.

సన్మానం

బచ్చన్నపేట: తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం జాయింట్‌ కార్యదర్శిగా ఎన్నికై న మండల కేంద్రానికి చెందిన గుర్రపు బాలరాజును పలువురు మండల నాయకులు పద్మశాలిభవన్‌లో సోమవారం సన్మానించారు. దాచెపల్లి నర్సింగారావు, ఎల్లయ్య, రాములు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగులను ఆదుకోవాలి

బచ్చన్నపేట: దివ్యాంగులను ఆదుకోవాలని క్రికెట్‌ టీం దివ్యాంగ సభ్యుడు పి.అమరేశ్వర్‌ అన్నారు. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందించారు. సభ్యులు మట్టి కిషన్‌, ఆంజనేయులు, ఫారుక్‌, శ్రీకాంత్‌ ఉన్నారు.

విహారయాత్రలో విద్యార్థులు

బచ్చన్నపేట: మండల కేంద్రంలోని వాణి ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆదివారం రాత్రి విహార యాత్రకు వెళ్లారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్‌ భాస్కరుని సుమలత మాట్లాడుతూ విహారయాత్రలు విజ్ఞానానికి దోహదపడతాయని అన్నారు. మహబూబ్‌నగర్‌లో పిల్లల మర్రి, గద్వాల్‌ కోట, జూరాల పార్క్‌, జోగులాంబ ఆలయం పలు చారిత్రక ప్రదేశాలను చూపించామన్నారు.

న్యాయం చేయాలి

బచ్చన్నపేట: తమ భూమిని కొందరు అక్రమంగా కబ్జా చేయాలని కుట్రలు చేస్తూ, చంపుతామని బెదిరిస్తున్నారని మండలంలోని ఇటుకాలపల్లి గ్రామానికి చెందిన చెవెల్ల స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై సోమవారం రక్షణ కల్పించాలని స్వామి పోలీసులను ఆశ్రయించి గోడు వెల్లబోసుకున్నారు.

తులసి, పూల అలంకరణలో వెంకన్న

చిల్పూరు: ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా సోమవారం తులసి దళాలు, పూలతో బుగులు వేంకటేశ్వర స్వామి వారికి విశేష అలంకరణ చేశారు. ఆలయ అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యులు వేద మంత్రాల నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

‘బీజేపీ మతోన్మాద విధానాలను వ్యతిరేకించాలి’

జనగామ రూరల్‌/పాలకుర్తి/బచ్చన్నపేట: బీజేపీ మతోన్మాద విధానాలను వ్యతిరేకించాలని జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలో ఐదో వార్డు ఏసీరెడ్డి కాలనీలో పట్టణ కార్యదర్శి జోగు ప్రకాశ్‌ అధ్యక్షతన న్విహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 27 28 తేదీల్లో స్టేషన్‌ ఘన్‌పూర్‌లో నిర్వహించనున్న పార్టీ జిల్లా మహాసభలను విజయ వంతం చేయాలన్నారు. పందిళ్ల కళ్యాణి, పల్లెర్ల లలిత, బూడిద ప్రశాంత్‌, అంజమ్మ, భిక్షపతి, మేడ ఆనందం తదితరులు పాల్గొన్నారు. అలాగే పాలకుర్తి మండలం బమ్మెర గ్రామంలో, బచ్చన్నపేట మండల కేంద్రంలో మహాసభల వాల్‌పోస్టర్లను నాయకులు ఆవిష్కరించారు. నాయకులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement