క్రీస్తు బోధనలు ఆచరణీయం
జనగామ రూరల్: క్రీస్తు బోధనలు ఆచరణీయమైనవని, సమాజంలో ప్రేమ కరుణతో మెలగాలని ఆయన చూపిన సత్య మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని ఆర్డీఓ గోపీనాథ్ అన్నారు. సోమవారం పట్టణంలో గాయత్రి గార్డెన్‌లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన కిస్మస్ వేడకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేసి మాట్లాడారు. క్రీస్తు బోధనలు ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలని చెప్పారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి బి.రవీందర్, తహశీల్దార్ హుస్సేన్, ఎంపీడీఓ సంపత్‌కుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు, ఏఎంసీ డైరెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, క్రైస్తవ మత బోధకులు, నాయకులు పాల్గొన్నారు.
ఆర్డీఓ గోపీనాథ్
Comments
Please login to add a commentAdd a comment