నిధులు మంజూరు చేయండి
రఘునాథపల్లి: మండలంలోని ఇబ్రహీంపూర్‌లో శిథిలమవుతున్న మహిళా సంఘం భవనం మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ఆ గ్రామ వైష్ణవి, గాయత్రి గ్రామైఖ్య సంఘాల ప్రతినిధులు సోమవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిసి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ లింగాల జగదీష్‌చందర్‌రెడ్డితో కలిసి హనుకొండలో ఎమ్మెల్యేను కలిసి సమస్య విన్నవించారు. త్వరలోనే మహిళా భవనం మరమ్మతులకు రూ.5 లక్షల నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు మహిళా ప్రతినిధులు తెలిపారు.
చిల్పూరు: కృష్ణాజీగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు చిల్పూరు ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండలో ఎమ్మెల్యే కడియం శ్రీహరిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామ సమస్యలను విన్నవించారు.
Comments
Please login to add a commentAdd a comment