హామీ నిలబెట్టుకోవాలి
● ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల దీక్షలో
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
జనగామ: సమగ్రశిక్ష అభియాన్‌లో పనిచేస్తున్న ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులకు రెగ్యులరైజేషన్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. కలెక్టరేట్‌ఏరియాలో 14 రోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్షకు సోమవారం ఎమ్మెల్యే సంఘీభావం తెలిపి మాట్లాడారు. సర్వశిక్ష అభియాన్‌లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి సమస్య తనకు తెలుసని, పోరాటంలో అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్‌పర్సన్ పోకల జమునలింగయ్య, ఫ్లోర్ లీడర్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, కౌన్సిలర్లు తాళ్లసురేష్‌రెడ్డి, ముస్త్యాల దయాకర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment