కలెక్టర్‌ను కలిసిన హౌసింగ్ పీడీ
జనగామ: జిల్లాకు కొత్తగా వ చ్చిన గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ (పీడీ)గా మత్రునాయక్ మంగళవారం కలెక్టర్ రిజ్వాన్ బాషాను మర్యాద పూర్వకంగా కలిశారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు.
తగ్గిన కేసులు..
● పెరిగిన చలాన్లు, డ్రంకెన్ డ్రైవ్ కేసులు
● వివరాలు వెల్లడించిన డీసీపీ రాజమహేంద్రనాయక్
జనగామ: 2023 సంవత్సరంతో పోలిస్తే, 2024లో కేసులు, మ ర్డర్లు, చోరీలు, ఎస్సీ ఎస్టీ, మహిళలపై వేధింపులు తగ్గగా... గేమింగ్ యాక్టు, ఇసుక అక్రమ రవాణా, చలాన్లు, డ్రంకెన్ డ్రైవ్, గంజా యి కేసులు, రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. ఈ మేరకు మంగళవారం 2024 సంవత్సరానికి సంబంధించిన కేసుల వివరాలను డీసీపీ రాజమహేంద్రనాయక్ వెల్లడించారు. 2024 సంవత్సరంలో వెస్ట్‌జోన్ పరిధిలో 3,306 కేసులు నమోదు చేశారు. 2023 ఏడాది తో పోలిస్తే 5 శాతం తగ్గాయి. 2023లో 312 రోడ్డు ప్రమాదాలు జ రుగగా, 141 మంది చనిపోయారు. 2024లో 331 రోడ్డు ప్రమాదా ల్లో 161 మంది మృత్యువాతపడ్డారు. గతేడాది చలాన్ల రూపంలో పోలీసు శాఖకు రూ.67లక్షల మేర జరిమానా రూపంలో తీసుకున్నారు. 2024లో శాంతిభద్రతల పరిరక్షణలో మెరుగైన ఫలితాలు సాధించిన పోలీసు శాఖ.. 2025 న్యూ ఇయర్‌లో అంతకుమించి విజయం సాధించేలా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment