కడియం వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి
చిల్పూరు: ఇటీవల మల్కాపూర్‌లో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కల్వకుంట్ల కుటుంబం కటకటాల పాలవుతుందని చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ మండల నాయకు డు జనగామ యాదగిరి డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక తహసీల్ కార్యాలయం ఎదుట సోమవారం కడియంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకు ముందు ఎమ్మెల్యే శ్రీహరి కొండాపూర్‌కు వస్తున్నట్లు తెలుసుకున్న బీఆర్‌ఎస్ నాయకులు కొమ్ముగుట్టకు వెళ్లి అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్నట్లు స్టేషన్‌ఘన్‌పూర్ ఏసీపీ భీంశర్మ తెలుసుకున్నారు. జనగామ రూరల్, స్టేషన్‌ఘన్‌పూర్ సీఐ లు ఎడవెళ్లి శ్రీనివాస్‌రెడ్డి, వేణు, ఎస్సైలు సిరిపురం నవీన్‌కుమార్, వినయ్‌కుమార్ పోలీస్ సిబ్బందితో వెళ్లి వారిని వారించారు. అయినా ఫలితం లేక పోవడంతో పోలీస్ బందోబస్తు నడుమ అదుపులోకి తీసుకుని మండల కేంద్రానికి తరలించడంతో తహసీల్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. కార్యక్రమంలో వెన్నం మాధవరెడ్డి, రాకేష్‌రెడ్డి, యాకూబ్‌పాషా, రంగు రవి, శ్రీను, అసాద్, వెంకటస్వామి, రాజేష్, తోట రాజయ్య, రమాకాంత్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ నాయకుల నిరసన
Comments
Please login to add a commentAdd a comment