ఆరు నెలల్లో సాగునీరు అందిస్తాం..
చిల్పూరు: ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు పట్టించుకోను.. ఇచ్చిన హామీ మేరకు ఆరు నెలల్లో అన్ని చెరువులు, కుంటలను గోదావరి జలాలతో నింపి సాగునీరు అందించి రైతుల్లో సంతోషం నింపుతా నని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ, హనుమకొండ జిల్లాల పరిధి వర్షాభావ ప్రాంతాల్లో 52 చెరువులకు సాగునీరు అందించేందుకు చేపట్ట నున్న మూడు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల పనులకు సోమవారం కొండాపూర్‌లో శంకుస్థాపన చేశారు. ముందుగా సాగునీటి వసతులు లేని వేలేరు మండలంతో పాటు చిల్పూరు మండల పరిధి శ్రీపతిపల్లి, కొండాపూర్, లింగంపల్లి, మల్కాపూర్ రైతులు సమస్యలు విన్నారు. అనంతరం సమావేశంలో మాట్లాడుతూ రెండేళ్ల క్రితం బీఆర్‌ఎస్ హయాంలో పనులకు శంకుస్థాపన చేస్తే పనులు మొదలుపెట్టని వారంతా.. ఇప్పుడు తాను మొదలు పెడుతుంటే ప్రతిపక్షాలు ఆరోపించడం వారి అవివేకమన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సురేష్, చిల్పూరు ఆలయం, మార్కెట్ చైర్మన్‌లు పొట్లపల్లి శ్రీధర్‌రావు, లావణ్యశిరీష్‌రెడ్డి, పుల్యాల నారాయణరెడ్డి, యశ్వంతరెడ్డి, పులికాశి రాజయ్య, ఇల్లందుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి
Comments
Please login to add a commentAdd a comment