ప్రభుత్వ పథకాలతో జీవనోపాధి పొందాలి
జనగామ రూరల్: పేదరిక నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు ప్రతీ ఒక్కరూ తెలుసుకుని వాటిద్వారా జీవనో పాధి పొందాలని సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్ అన్నారు. జిల్లా కేంద్రం ప్రెస్టెన్ గ్రౌండ్‌లో నివసిస్తున్న గుడిసెవాసులకు సోమవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మట్లా డారు. ప్రతి ఒక్కరూ ఆధార్, రేషన్, లేబర్ కార్డు కలిగి ఉండాలని, పిల్లలను బాల కార్మికులుగా మార్చకుండా బడికి పంపి విలువలతో కూడిన జీవితాన్ని అందించాలని సూ చించారు. ప్రెస్టెన్‌లో నివసిస్తున్న పేదల సమస్యలు తెలుసుకుని రాతపూర్వకంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు తెలియజేయాలని ఆదేశించారు. చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎం.రవీంద్ర, పారాలీగల్ వలంటర్‌లు రాములు, స్వప్న, శంకర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఉచిత కుట్టు మిషన్లకు
దరఖాస్తు చేసుకోవాలి
జనగామ: జిల్లాలో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మైనారిటీ మహిళలకు ఇందిరమ్మ మహిళా శక్తి పథకం ద్వారా ఉచితంగా కుట్టు మిషన్లు అందజేయనున్నారు. అర్హులంతా ఈనెల 20వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తులను కలెక్టరేట్‌లోని కార్యాలయంలో అందజేయాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి బి.రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. మైనారిటీ కమ్యూనిటీకి చెందిన మహిళలు, విడాకులు తీసుకున్న వారు, వితంతువులు, అనాధలు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఉంటుందని, వయసు 18 నుంచి 55 ఏళ్లు ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంత మహిళల వార్షిక ఆదాయం రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతంలో రూ.2లక్షలు ఉండాల ని పేర్కొన్నారు. టైలరింగ్ కోర్సులో శిక్షణ పొందిన వారు కుటుంబంలో ఎందరు ఉన్నా ఒక్క కుట్టు మిషన మాత్రమే ఇస్తారని తెలిపారు. దరఖాస్తుతో కుట్టు శిక్షణ ధ్రువీకరణ పత్రం, కనీస విద్యార్హత 5వ తరగతి వరకు చదివి ఉండాలని సూచించారు. ఐదేళ్ల కాలంలో దరఖాస్తు దారు రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఎటువంటి ఆర్థిక సహాయం పొందలేదని లిఖిత పూర్వకంగా ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
రాష్ట్ర ఆర్గనైజింగ్
సెక్రటరీగా కుమారస్వామి
జనగామ: తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా జనగామకు చెందిన అసిస్టెంట్ లైన్‌మెన్ మాచర్ల కుమారస్వామి నియమితులయ్యారు. ఈ మేరకు యూనియన్ జాతీయ, రాష్ట్ర ప్రతినిధులు సుదీప్ దత్త, పాలడుగు భాస్కర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర కమిటీలో చోటు కల్పించిన ప్రతినిధులకు ఈ సందర్భంగా కుమారస్వామి కృజ్ఞతలు తెలిపారు.
క్రాంతికుమార్‌కు డాక్టరేట్
కొడకండ్ల : మండలకేంద్రానికి చెందిన అనంతోజు క్రాంతికుమార్ కాకతీయ యూనివర్సిటీ నుంచి వాణిజ్యం, వ్యాపార నిర్వహణ విభాగంలో డాక్టరేట్ పొందారు. అనంతోజు సోమయ్యచారి–గోవిందమ్మ దంపతుల కుమారుడు క్రాంతికుమార్ ప్రాథమిక విద్యను కొడకండ్ల ప్రభుత్వ పాఠశాలల్లో, బీకామ్, ఎంకామ్, ఎంబీఏ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశాడు. ప్రస్తుతం బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఫైనాన్స్ విభాగంలో ఉద్యోగి గా పనిచేస్తున్నాడు. ప్రొఫెసర్ కట్ల రాజేందర్ పర్యవేక్షణలో ‘భారత దేశంలో ఆర్థిక అక్షరాస్య త, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ’ అనే అంశంపై తెలంగాణలో ఎంపిక చేసిన నగరాలపై పరిశోధన పూర్తి చేసి అరుదైన డాక్టరేట్ పొందాడు.
విశాల ప్రదేశాల్లో
పతంగులు ఎగుర వేయాలి
జనగామ: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పట్టణం, ఊర్లలోని ఖాళీ, విశాల ప్రదేశాల్లో మాత్రమే పతంగులు ఎగుర వేయాలని ఎప్పీడీసీఎల్ ఇన్‌చార్జ్ ఎస్‌ఈ కె.వెంకటరమణ తెలిపారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్న ప్రాంతాల్లో పతంగులు ఎగుర వేసిన సమయంలో ధారాలు వాటిపై చిక్కి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. విద్యుత్ సరఫరాలకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. పతంగులకు చైనా మాంజా ఉపయోగించొద్దని, పక్షులతోపాటు వాహనాలపై వెళ్లే మనుషుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంద ని వివరించారు. గాలిపటం కరెంటు తీగలకు చుట్టుకున్న సమయంలో ధారాన్ని లాగడం లేదా కర్ర, ఇనుప పైపు లాంటివాటితో తొలగించే ప్రయత్నం చేయకూడదని, అవసరమైతే సమీప విద్యుత్ సిబ్బందికి తెలపాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment