పెండింగ్ పనులు పూర్తి చేయాలి
సాక్షి ప్రతినిధి, వరంగల్: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ)కు సంబంధించి స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, స్టేషన్‌ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులకు సూచించారు. హనుమకొండ కనకదుర్గకాలనీలోని ఎమ్మెల్యే శ్రీహరి నివాసంలో ఎన్‌హెచ్ అథారిటీ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో వారు మాట్లాడారు. జనగామ ఆర్‌ఓబీ నుంచి కరుణాపు రం వరకు అన్ని గ్రామాల్లో సైడ్ డ్రెయినేజీలు నిర్మించారని, అయితే ఆ డ్రెయినేజీ నీరు బయటకు వెళ్లకుండా గ్రామాల్లోకే వస్తోందన్నారు. ఆ నీరు బ యటకు వెళ్లేలా నిర్మాణం చేపట్టాలని సూచించారు. వరంగల్ నుంచి జనగామ పట్టణానికి వెళ్లే జంక్షన్‌లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, జంక్షన్ అభివృద్ధి చేయాలన్నారు. జనగామ, సూర్యాపేట ఆర్‌ఓబీకి ఇరువైపులా ఉన్న అప్రోచ్ రోడ్లు, ‘యు’ టర్నులు సరిగా లేవని, వెంటనే వాటిని సరిచేయాలని చెప్పారు. స్టేషన్‌ఘన్‌పూర్, నిడిగొండ, ఛాగల్, చిన్నపెండ్యాల గ్రామాల్లో సర్వీస్ రోడ్డు చివరి వరకు బారీకేడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. వీటన్నింటినీ స్వయంగా పరిశీలించి సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని ఎన్‌హెచ్‌ఏఐ పీడీ హామీ ఇచ్చారు. అలాగే చిన్నపెండ్యాల గ్రామం వద్ద సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు రూ.27లక్షలు మంజూరయ్యాయని, త్వరలోనే టెండర్ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
వరంగల్ ఎంపీ కడియం కావ్య,
ఎమ్మెల్యే కడియం శ్రీహరి
నేషనల్ హైవే అథారిటీ అధికారులతో సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment