ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
ఫాస్ట్‌ఫుడ్ కల్చర్‌తో మానవ శరీరంపై వ్యతిరేక ప్రభావం ఉంటుంది. ఎక్కువ తినడం, తక్కువ పని చేయడం వల్ల షుగర్, గుండెవ్యాధులు, జీర్ణ సంబంధిత రోగాలు, అల్సర్, కొలెస్ట్రాల్ ఇలా అనేక రోగాల బారిన పడుతున్నారు. ఎక్కువగా నిల్వ చేసిన పదార్థాలను వేడి చేసి ఇస్తున్నారు. ఇది ప్రమాదకరం. బయటి ఆహారాన్ని తక్కువ చేసి, ఇంట్లో తయారు చేసుకున్న ఆహారాన్ని తీసుకుంటూ, జీవన విధానాన్ని మార్చుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు.
– డాక్టర్ శ్రీకాంత్ (ఎంఎస్), అసిస్టెంట్
ప్రొఫెసర్, జనరల్ సర్జరీ, ప్రభుత్వ ఆస్పత్రి
తనిఖీలు చేపడతాం..
జిల్లా కేంద్రంలో గతంలో అనేకసార్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లలో తనిఖీలు చేసి జరిమానా విధించాం. అయినా మార్పు రావడం లేదు. రెండు, మూడు రోజుల్లో మరోసారి తనిఖీ చేసి చర్యలు తీసుకుంటాం. నిర్వాహకులు పరిసరాల పరిశుభ్రత పాటించాలి. నాణ్యత లేకుండా, హానికరమైన వస్తువులు వినియోగిస్తే తమకు సమాచారం అందించాలి. నిర్వాహకులు నిబంధనలు పాటిస్తూ హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను నడిపించాలి.
– కృష్ణమూర్తి, ఫుడ్ సేఫ్టీ అధికారి
●
Comments
Please login to add a commentAdd a comment