ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లపై దాడులు●
● రైస్, నూడుల్స్ స్వాధీనం, జరిమానా
జనగామ: జిల్లా కేంద్రంలో నిబంధనలకు విరుద్ధం ఆహార పదార్థాలు విక్రయిస్తున్న హోటల్స్, ఫాస్ట్ ఫుడ్, టిఫిన్ సెంటర్లపై అధికారులు బుధవారం ఆకస్మిక దాడులు చేపట్టారు. ‘ఫాస్ట్ ఫుడ్‌తో.. జర జాగ్రత్త’ అనే శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్పెషల్ గ్రేడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి, జిల్లా ఆహార భద్రత అధికారి వినీల్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారి పులి శేఖర్ హోటల్స్‌పై ఏకకాలంలో దాడులు చేపట్టారు. అధికారులు తనిఖీలు చేస్తున్నారనే సమాచారం మేరకు పలు ఫాస్ట్ సెంటర్లు హోటల్స్‌ను మూసి వేయగా, మిగతా వాటిలో తనిఖీలు చేపట్టారు. పులిచి పోయిన చట్నీ, రక్షణ లేకుండా ఉన్న నూడుల్స్, గాలికి వదిలేసి బోండాలు, అస్తవ్యస్తంగా కిచెన్ సెంటర్లు తదితర వాటిని చూసిన అధికారులు నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని అన్నపూర్ణ మెస్ రూ.500, గ్రీన్ బకెట్ బిర్యానీ సెంటర్ రూ.5,000, ఎస్‌ఆర్‌ఎం టిఫిన్ సెంటర్ రూ.2,000, ఎస్‌ఎస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ రూ.1,000, అక్షయ్ హోటల్ రూ.2,000, రుిచి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ రూ.2,000, లక్కీ రెస్టారెంట్ రూ.1,000 మొత్తంగా రూ.13,500 జరిమానా విధించారు. అక్షయ హో టల్‌లో చెట్నీ, బోండాలను స్వాధీనం చేసుకోగా, రుచి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో నూడుల్స్, రైస్‌ను తీసుకుని ఆరు బయట వేయించారు. మరోసారి తప్పు జరిగితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వారి వెంట శానిటేషన్ జవాన్లు, కార్మికులు ఉన్నారు. గతంలో కూడా సాక్షిలో వచ్చిన కథనాలతోనే అధికారులు స్పందించారు.
ఆగని మాంజా విక్రయాలు
జనగామ: జిల్లా కేంద్రంలో చైనా, లోకల్ మాంజా అమ్మకాలు ఆగడం లేదు. మాంజా అమ్మకాలపై పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతు న్నా.. గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నా రు. రైల్వేస్టేషన్ ఏరియాతో పాటు పోలీస్టేషన్ సమీపంలో పలువు రు దుకాణదారులు మాంజా విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. రహదారులపై ద్విచక్రవాహన చోదకుల ప్రాణాల మీదకు తెస్తున్న మాంజా అమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా, రహస్య ప్రాంతాల్లో డంప్ చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు సైతం మంజా అమ్మకాలపై నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment