ఏఎంసీలో టోపో గ్రాఫికల్ సర్వే
జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్‌లో అభివృద్ధి పనుల కోసం బుధవారం టోపో గ్రాఫికల్ సర్వే నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, ప్రత్యేక శ్రేణి కార్యదర్శి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ సర్వే పనులను ప్రారంభించారు. అనంతరం శివరాజ్ మాట్లాడుతూ మార్కెట్‌లో రైతులు, సరుకుల కొనుగోలు సౌకర్యార్థం అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అడ్తి అసోసియేషన్ అధ్యక్షుడు మాశెట్టి వెంకన్న, ఏఎంసీ డైరెక్టర్లు బన్సీ నాయక్, బొట్ల నర్సింగరావు, నాగబండి రవీందర్, నామాల శ్రీనివాస్, నాయకులు ఉదయ్, నరేష్, రాజు, మార్కెట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సబ్‌సెంటర్‌ను పరిశీలించిన ఒడిశా వైద్యబృందం
బచ్చన్నపేట: మండలంలోని ఆలింపూర్ గ్రామంలోని హెల్త్ సబ్ సెంటర్‌ను ఒడిశా వైద్య బృందం సభ్యులు బుధవారం పరిశీలించారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ శ్రీదేవి ఆధ్వర్యంలో 22 మంది వైద్య బృందం ఆస్పత్రిలోని అన్ని వసతులను పరిశీలించారు. అనంతరం శ్రీదేవి మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్యసేవలను పరిశీలించడానికి ఒడిశా వైద్య బృందం వచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఏఎన్‌ఎంలు, ఆశలు పలువురు పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై
అప్రమత్తంగా ఉండాలి
జనగామ: సైబర్ నేరాలపై ప్రతీఒక్కరు అప్రమత్తంగా ఉండాలని పట్టణ సీఐ దామోదర్‌రెడ్డి అన్నారు. జనగామ మండలం యశ్వంతాపూర్ క్రీస్తు జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో డైరెక్టర్ డి.విజయపాల్‌రెడ్డి అధ్యక్షతన సైబర్ సేఫ్టీపై జరిగిన సమావేశంలో సీఐ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సైబర్ నేరా లు ఎలా చేస్తారనే దానిపై విద్యార్థులు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. సమాజంలో సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు తమ పంథాను మారుస్తూ కొత్త తరహా ఆలోచనలతో నేరాలకు పాల్పడుతున్నారన్నారు. స్మార్ట్‌ఫోన్ ద్వారా మెసేజ్, ఫోన్ కాల్స్ ఇలా అనేక రకాలుగా సాంకేతికతను ఉపయోగిస్తూ బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారని, ఈ సమయంలోనే అప్రమత్తంగా ఉంటేనే మేలన్నారు. డైరెక్టర్ విజయపాల్‌రెడ్డి మాట్లాడుతూ సైబర్ నేరాలపై విద్యార్థులకు చక్కగా అవగాహన కల్పించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్వేత, విద్యార్థులు పాల్గొన్నారు.
11 నుంచి రాష్ట్ర స్థాయి
కబడ్డీ పోటీలు
స్టేషన్‌ఘన్‌పూర్: మండలంలోని ఛాగల్లు గ్రా మంలో స్వాగత్ యూత్ ఆధ్వర్యంలో ఈనెల 11వ తేదీ నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు యూత్ గౌరవ అధ్యక్షుడు పోగుల సారంగపా ణి, అధ్యక్షుడు కూన రాజు, కోశాధికారి అన్నెపు అనిల్ తెలిపారు. ఈ మేరకు బుధవారం వారు విలేకరులతో మాట్లాడతూ రాష్ట్ర, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అనుమతితో ఛాగల్లులోని ప్రభు త్వ ఉన్నత పాఠశాలలో ఈ పోటీలు నిర్వహించున్నట్లు తెలిపారు. గెలుపొందిన జట్లకు నగ దు బహుమతి అందించనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు 9966868076, 9000417608 లో సంప్రదించాలని కోరారు.
12 నుంచి ఉమ్మడి జిల్లా స్థాయి ..
పాలకుర్తి టౌన్:మండల కేంద్రంలో యువ చైత న్య యూత్ 11వ వార్షికోత్సం పురస్కరించుకొని ఈనెల 12, 13న ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు యూత్ అధ్యక్షుడు ఎడవెల్లి సోమేశ్వర్ బుధవారం తెలిపారు. వివరాలకు 7989553593, 7396967526 లో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment