1.50లక్షల ఎకరాలకు సాగునీరు
స్టేషన్‌ఘన్‌పూర్/రఘునాథపల్లి: దేవాదుల పథకం ద్వారా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు 1.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని ఛాగల్లు శివారులోని ఘన్‌పూర్ రిజర్వాయర్, రఘునాథపల్లి మండలంలోని అశ్వరావుపల్లి రిజర్వాయర్ సాగునీటిని అధికారులతో కలిసి బుధవారం విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే కడియం మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని, అయితే డిస్ట్రిబ్యూషన్స్, ప్రధాన కాల్వలు, లైనింగ్ పనులు చేయించాల్సిన అవసరం ఉందన్నారు. నియోజకవర్గంలో ప్రతీ ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు దివాళాకోరు రాజకీయాలు మానుకోవాలని, నియోజకవర్గ అభివృద్ధికి అందరూ సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ లావణ్యశిరీష్‌రెడ్డి, నాయకులు బెలిదె వెంకన్న, సీహెచ్.నరేందర్‌రెడ్డి, నీల గట్టయ్య, సారంగపాణి, మధుసూద న్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మారుజోడు రాంబాబు, మాజీ జెడ్పీటీసీలు లింగాల జగదీష్‌చందర్‌రెడ్డి, బొల్లం అజయ్, గుడి వంశీధర్‌రెడ్డి, నరేందర్, ఇరిగేషన్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఘన్‌పూర్, అశ్వరావుపల్లి రిజర్వాయర్ సాగు నీరు విడుదల
Comments
Please login to add a commentAdd a comment