ప్రణాళికతో విజయం | - | Sakshi
Sakshi News home page

ప్రణాళికతో విజయం

Published Thu, Jan 9 2025 1:42 AM | Last Updated on Thu, Jan 9 2025 1:42 AM

ప్రణా

ప్రణాళికతో విజయం

‘పరీక్ష’

కాలం..

సమీపిస్తున్న టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు

విద్యార్థుల సన్నద్ధతపై టీచర్లు, లెక్చరర్ల దృష్టి

ప్రణాళికాబద్ధంగా చదివితే ఉత్తమ ఫలితాలు

ఇంటర్‌ ఫస్టియర్‌ :

19,468

సెకండియర్‌ :

20,387

ఇంటర్‌ ఫస్టియర్‌ :

5,798

సెకండియర్‌ :

6,473

విద్యారణ్యపురి:

రీక్షలు సమీపిస్తున్నాయి. టెన్త్‌, ఇంటర్‌ విద్యార్థులు చదువుల్లో మునిగిపోయారు. ఇంటర్‌ పరీక్షలు మార్చి 5 నుంచి, టెన్త్‌ వార్షిక పరీక్షలు మార్చి 21 నుంచి జరగనున్నాయి. దీంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ యాజమాన్యాల విద్యా సంస్థలు విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించాయి. ఈనేపథ్యంలో ప్రణాళికాబద్ధంగా చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని ఉపాధ్యాయులు, అధ్యాపకులు చెబుతున్నారు.

90 రోజుల ప్రణాళిక

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల పరిధి కళాశాలల్లో ఇంటర్‌ విద్యార్థులకు 90 రోజుల ప్రత్యేక ప్రణాళికతో విద్యాబోధన కొనసాగుతోంది. సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్స్‌ రూపొందించినట్లుగా ప్రతీ కళాశాలలో సబ్జెక్టుల వారీగా అధ్యాపకులు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి బోధిస్తున్నారు. స్టడీ అవర్స్‌, యూనిట్‌ టెస్టులు, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధతో విద్యాబోధన కొనసాగుతోంది. ఈనెల 20 నుంచి ప్రీఫైనల్‌ పరీక్షలు జరగనున్నాయి. కొన్నిచోట్ల సబ్జెక్ట్‌ సిలబస్‌ పూర్తి కాగా.. మరికొన్ని చోట్ల రివిజన్‌ క్లాసులు కొనసాగుతున్నాయి. కాగా.. విద్యాబోధనను పర్యవేక్షించేందుకు ఇంటర్‌ బోర్డ్‌ ఉమ్మడి జిల్లాకు నియమించిన అబ్జర్వర్‌ (ఇంటర్మీడియట్‌ బోర్డ్‌ డిప్యూటీ సెక్రటరీ) టి.యాదగిరి మంగళవారం ఉమ్మడి జిల్లాలోని పలు కళాశాలలను పరిశీలించారు. విద్యార్థులు, అధ్యాపకులతో మాట్లాడారు. అత్యధిక ఉత్తీర్ణత సాధించేలా సూచనలిచ్చారు.

స్పెషల్‌ క్లాసులు..

ఉమ్మడి జిల్లాలో టెన్త్‌ విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి బోధిస్తున్నారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల బాగా చదివే విద్యార్థులను గుర్తించి వారికి 10/10 జీపీఏ వచ్చేలా కృషి చేస్తున్నారు. పరీక్షల నేపథ్యంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా సూచనలు చేస్తున్నారు.

పది : 6,236

పరీక్షలు ఎప్పుడంటే..

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ఫిబ్రవరి 3వ తేదీనుంచి, పబ్లిక్‌ పరీక్షలు మార్చి 5వ తేదీనుంచి, పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 21వ తేదీనుంచి ప్రారంభమవుతాయి.

ఇంటర్‌ ఫస్టియర్‌ :

4,198

సెకండియర్‌ :

4,673

పది : 8,902

ఇంటర్‌ ఫస్టియర్‌ :

4,500

సెకండియర్‌ :

4,000

జేఎస్‌ భూపాలపల్లి

ములుగు

పది : 3,376

పది : 3,134

ఇంటర్‌ ఫస్టియర్‌ :

1,714

సెకండియర్‌ :

1,789

● ఆకుకూరలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. అదేవిధంగా ప్రొటీన్లు, విట మిన్లు, మినరల్స్‌ ఉండే ఆహారం తీసుకోవాలి.

● పరీక్షలు ముగిసే వరకు మాంసాహారం జోలికి వెళ్లకపోవడం మంచిది. అదేవిధంగా జంక్‌ఫుడ్స్‌, బయటి ఆహారం, కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి.

● కనీసం రోజు 6 నుంచి 7 గంటలు నిద్రపోవాలి. రోజూ ఉదయం, సాయంత్రం కొంత సమయం యోగా, ధ్యానం వంటివి చేస్తే ఆక్సిజన్‌ పూర్తిస్థాయి అంది మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

● రోజూ గంటల తరబడి ఒకే దగ్గర కూర్చొని చదవకుండా.. మధ్యమధ్యలో కాసేపు విరామం ఇవ్వాలి. కొద్దిసేపు ఇంట్లోనే అటూ, ఇటూ తిరిగితే రిలాక్స్‌గా ఉంటుంది.

సూచనలివే..

● పరీక్షలు అంటే భయం ఉండకూడదు. సమయాన్ని వృథా చేయకుండా సబ్జెక్టుల వారీగా ప్రణాళిక రూపొందించుకోవాలి.

● సిలబస్‌ పూర్తయ్యిందని ఇంటి వద్దే ఉండొద్దు. తరగతులకు హాజరైతే పునఃశ్చరణ, సందేహాల నివృత్తి జరుగుతుంది. స్టడీఅవర్స్‌లో ప్రత్యేక శ్రద్ధతో చదువుకునే అవకాశం పాఠశాలల్లో,కళాశాలల్లో ఉంటుంది

● పాత ప్రశ్నపత్రాలు, మోడల్‌ పేపర్లు ప్రాక్టీస్‌ చేస్తే పరీక్ష పద్ధతులు తెలుస్తాయి.

● పిల్లలు చదువుతున్నారా లేదా అని తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. వారి చదువుకు సహకరించాలి.

● ఆత్మవిశ్వాసం పెంచడం..ఒత్తిడి లేకుండా పిల్ల లను ప్రోత్సహించి, వారి ప్రగతిని ప్రశంసించడం.

● భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, మేథమెటిక్స్‌లోని భావనలు నేర్చుకోవడం.

● సూత్రాలు, సిద్ధాంతాలు అవగాహన: ముఖ్యమైన సిద్ధాంతాలను బాగా అర్థం చేసుకోవడం.

● ప్రయోగాలు, పటాలు, ఉదాహరణలు, అప్లికేషన్లు ప్రాక్టీసు చేయాలి.

● విద్యార్థులు చదువుతున్నప్పుడు మధ్య మధ్యలో కొంత సేపు విశ్రాంతి తీసుకోవాలి.

ఇవి దూరంగా పెట్టండి..

● ఏకాగ్రతను దెబ్బతీసే టీవీ, మొబైల్‌ ఫోన్లకు దూరంగా ఉండాలి. మొబైల్‌ఫోన్లలో గేమ్స్‌ ఆడడం వంటివి చేయొద్దు.

● సినిమాలకు, అనవసర ఫంక్షన్లకు, విందులు వినోదాలకు దూరంగా ఉంటే మంచిది.

● చదువు విషయంలో రేపు చూద్దాం.. గంట తరువాత చదువుదాంలాంటి బద్దకం, నిర్లక్ష్యం వహించద్దు.

● తమ సహచర విద్యార్థులతో వివిధ సబ్జెక్టుల్లోని విషయాలను చర్చించాలి కానీ.. సంబంధంలేని విషయాలను వదిలేయాలి.

పరీక్ష రాసే సమయంలో..

● ప్రశ్నలను పూర్తిగా చదివి, ప్రశ్నలను అర్థం చేసుకుని సమాధానం ఇవ్వాలి.

● సమర్థంగా సమాధానం రాయాలి. ప్రశ్నల ప్రాధాన్యాన్ని గుర్తించి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

● రివిజన్‌: సమాధానాలను తిరిగి చూసి, తప్పులను సరిచేసుకోవాలి.

ఆరోగ్యమూ ముఖ్యమే..

No comments yet. Be the first to comment!
Add a comment
ప్రణాళికతో విజయం1
1/5

ప్రణాళికతో విజయం

ప్రణాళికతో విజయం2
2/5

ప్రణాళికతో విజయం

ప్రణాళికతో విజయం3
3/5

ప్రణాళికతో విజయం

ప్రణాళికతో విజయం4
4/5

ప్రణాళికతో విజయం

ప్రణాళికతో విజయం5
5/5

ప్రణాళికతో విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement