పవర్ ప్లాంట్ ఏర్పాటుకు స్థలం గుర్తించాలి
జనగామ: జిల్లాలో మహిళా సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఖాళీ స్థలాలను గుర్తించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశం హాలులో రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్‌తో కలిసి ఆర్డీఓలు, ఎస్డీసీలు, తహసీల్దార్‌లతో సోలార్ పవర్ ప్లాంట్, ధరణి పెండింగ్ దరఖాస్తులు, రేషన్ షాపులు, తదితర అంశాలపై కలెక్టర్ గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 77 సబ్ స్టేషన్‌లలో 2 కిలో మీటర్ల పరిధిలో ఒక మెగా వాట్ తయారీ కోసం 5 ఎకరాల భూమిని కేటాయించే విధంగా గుర్తించాలని సూచించారు. ఇందుకు సంబంధించి మొత్తంగా 150 ఎకరాల భూమి అవసరముంటుందన్నారు. నీటి పారుదల శాఖ పరిధిలో ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి మండల, గ్రామాల వారీగా ఎంత భూమి ఉందనే పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ధరణి పెండింగ్ దరఖాస్తులకు సంబంధించి అన్ని మాడ్యూల్స్‌లోని టెక్నికల్, ఉపయోగించే విధానంలో కలిగే సమస్యలు, పలు సూచనలతో మండలాల వారీగా నివేదికను ఇవ్వాల్సి ఉంటుందన్నారు. గురుకులాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కోటాలో 60 వేల సీట్లకు గాను కామన్ ప్రవేశ పరీక్షను నిర్వహించేందుకు తహసీల్దార్ కార్యాలయాల్లో బ్యానర్‌లను ఏర్పాటు చేయాలన్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు రేషన్ దుకాణాలను ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. రేషన్ దుకాణాల్లోని రిజిస్టర్లు, రికార్డుల నిర్వహ ణను, స్టాక్ వివరాలు తదితర వాటిపై పర్యవేక్షించాలన్నారు. అక్రమ రేషన్ బియ్యంపై కఠినంగా వ్యవహరించాలన్నారు.
లైంగిక వేధింపులు చట్టరీత్యా నేరం..
లైంగిక వేధింపులు చట్టరీత్యా నేరమని, మాదక ద్రవ్యరహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసినిలతో కలిసి మహిళా ఉద్యోగులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో, జిల్లా, మండల స్థాయి అన్ని శాఖల కార్యాలయాల్లో పనిచేసే మహిళల దృష్ట్యా ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీని ఏర్పాటు చేయాలని, మహిళా వేధింపులకు గురైతే ఆ కమిటీలో ఫిర్యాదు చేయవచ్చన్నా రు. 181 నంబర్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చన్నా రు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ ఫ్లోరెన్స్, డీపీఓ స్వరూప, డీఆర్డీఏ వసంత, జౌళి శాఖ అధికారి చౌడేశ్వరి, గౌసియా బేగం, అధికారులు పాల్గొన్నారు. అలాగే గురుకులాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కోటాలో ప్రవేశ పరీక్షకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి వివిధ పాఠశాలల్లో ప్రవేశానికి కామన్ ప్రవేశ పరీక్షకు ఫిబ్రవరి 1వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
రేషన్ షాపుల్లో తనిఖీలు చేపట్టండి
సమీక్షలో కలెక్టర్ రిజ్వాన్ బాషా
Comments
Please login to add a commentAdd a comment