రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు
దేవరుప్పుల: రాజకీయాలకు అతీతంగా ఇంటింటా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీఓ టీ.సురేష్‌కుమార్ అధ్యక్షతన కల్యాణలక్ష్మీ, షాద్‌ముబారక్ కింద మంజూరైన 60 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, వంటగ్యాస్ రాయితీ, గృహజ్యోతి వంటి పథకాలను పారదర్శకంగా అమలు చేశారన్నారు. త్వరలో తెల్లరేషన్ కా ర్డులు కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం.మహిపాల్‌రెడ్డి, విజయడెయిరీ జిల్లా అధ్యక్షుడు కాసారపు ధర్మారెడ్డి, కాంగ్రెస్ పార్డీ మండల అధ్యక్షుడు నల్ల శ్రీరాములు, మా జీ ప్రజాప్రతినిధులు రామచంద్రునాయక్, భాస్కర్, నర్సింహ్ములు, రమేష్, రతన్, నాగరాజు, సజ్జ న్, రవీందర్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షు డు పులిగిళ్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment