రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన
జఫర్‌గఢ్: రోడ్డు ప్రమాదాలపై వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య కోరారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్‌లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ అంబటి నర్స య్య మాట్లాడుతూ వాహనదారులు జాగ్రత్తలు పాటించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వీటిని నివారించేందుకు వాహనదారులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణించొద్దన్నారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట సీఐ కె.శ్రీనివాస్‌రావు, ఎస్సై రామ్‌చరణ్, సిబ్బంది, ప్రయాణికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
అవగాహన ఉండాలి
జనగామ రూరల్: వాహనదారులు రోడ్డు ప్రమాదాలపై అవగాహన ఉండాలని డీటీఓ శ్రీనివాస్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం పట్టణంలో తుపాన్ డ్రైవ ర్లు, గూడ్స్ డ్రైవర్లకు జనగామ చౌరస్తాలో రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మహేష్, తదితరులు పాల్గొన్నారు.
వర్ధన్నపేట ఏసీపీ నర్సయ్య
Comments
Please login to add a commentAdd a comment