ఇందిరమ్మ ఇళ్ల సర్వే 95 శాతం పూర్తి
జనగామ: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే 95శాతం పూర్తయినట్లు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్‌సింగ్, ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్‌తో కలిసి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల సర్వేను మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని, నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఊరుకునేది లేదన్నారు. ఈనెల 8న మధ్యాహ్నం 3 గంటల కు జిల్లా వ్యాప్తంగా మహిళా సాధికారత, మహిళల హక్కులు, లైంగిక వేధింపుల నివారణ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పా రు. తహసీల్దార్, ఎంపీడీఓ, మండల స్థాయి అధికారులు, సిబ్బంది సదస్సుల్లో పాల్గొనాలన్నా రు. ప్రస్తుత సీజన్‌లో జలుబు, దగ్గు, జ్వరం, ఇతర వ్యాధులు ప్రభలకుండా జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టరటేలోని అన్ని శాఖలు బయోమెట్రిక్ అడెండెన్స్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ఉద్యోగులు సమయ పాలన పాటించకుంటే చర్యలు తప్పవన్నారు. జనగామ, స్టేషన్‌ఘనపూర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమాన్‌నాయక్, ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, జెడ్పీ డిప్యూటీ సీఈఓ సరిత, డీఆర్‌డీఓ వసంత, సీపీఓ పాపయ్య, డీఈఓ రమేష్, డీపీఓ స్వరూప, డీడబ్ల్యూఓ ఫ్లోరెన్స్, డీఏఓ రామారావు నాయక్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
జలుబు, దగ్గు, జ్వరాలపై జాగ్రత్త
సమీక్షలో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా
Comments
Please login to add a commentAdd a comment