ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
● రవాణాశాఖ జిల్లా అధికారి శ్రీనివాస్‌గౌడ్
స్టేషన్‌ఘన్‌పూర్: ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫి క్ నిబంధనలు పాటించాలని రవాణాశాఖ జిల్లా అధికారి జీవీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జాతీయ భద్రత మాసోత్సవాల్లో భాగంగా స్థానిక లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాఠశాల యాజమాన్యాలు ట్రాఫిక్ నిబంధనలపై అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థులు స్కూల్ బస్సు ఎక్కే సమయంలో, దిగేటప్పుడు విధిగా అటెండెంట్ ఉండాలని, రోడ్డు దాటే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే మైనర్‌లకు వాహనాలు ఇవ్వొద్దని, ద్విచక్రవాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పేర్కొన్నారు.
కోఆప్షన్ సభ్యులుగా
నియమించాలి..
పాలకుర్తి టౌన్: అంగవైకల్యం కలిగిన వారికి స్థానిక సంస్థల్లో భాగస్వామ్యం కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ 2024 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయాలని మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ఛత్తీస్‌గఢ్(2019), రాజస్తాన్(2021) ప్రభుత్వాల విధానాల ను ఉదహరిస్తూ తెలంగాణలో అన్ని గ్రామీణ, పట్ట ణ, నగర స్థానిక సంస్థల్లో వికలాంగుల కోఆప్షన్ సభ్యత్వం అమలు చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment