![క్యాన](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/4/04-02-2025_wud_mr-1738613302-0.jpg.webp?itok=7UYnqd2B)
క్యాన్సర్‌ను జయించి..
బాధితుల్లో సంతాన ఫలాలు
..ఇలా క్యాన్సర్ ఉన్నప్పటికీ అనేక మంది ఐవీఎఫ్ ద్వారా తల్లిదండ్రులవుతున్నారు. వైద్యంతో వ్యాధిని నయం చేసుకుంటున్నారు. సాధారణ జీవితం గడుపుతున్నారు. నేడు (మంగళవారం) ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం సందర్భంగా మాతృత్వపు మాధుర్యాన్ని పొందుతున్న వారిపై ‘సాక్షి’ప్రత్యేక కథనం.
సంతానోత్పత్తికి ఆందోళన చెందొద్దు
దంపతుల్లో ఎవరికై నా క్యాన్సర్
ఉందని నిర్ధారణ అయితే ఆందోళన చెందాల్సి న అవసరం లేదు. ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్ ద్వారా మాతృత్వపు అనుభూతిని వారు పొందొచ్చు. అయితే కీమో, రేడియేషన్ థెరపీలు చేయించినట్లయితే మగవారిలో స్పెర్మ్ చురుకుదనం, ఆడవారిలో అండఫలదీకరణ మందగిస్తుంది. అందుకే థెరపీకి వెళ్లే ముందు స్పెర్మ్, ఎగ్స్‌లను స్టోర్ చేస్తాం. వారికి థెరపీ పూర్తయ్యాక అత్యాధునిక టెక్నాలజీలో ఐవీఎఫ్ ద్వారా సంతాన సాఫల్యాన్ని అందిస్తాం.
– డాక్టర్ కావ్యరావు జలగం, రీజనల్ మెడికల్ హెడ్,
ఓయాసిస్ ఫెర్టిలిటీ, హనుమకొండ
హన్మకొండ చౌరస్తా: క్యాన్సర్ మహమ్మారి ఏటా లక్షలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. వయస్సు, లింగబేధం తేడా లేకుండా అందరినీ వెంటాడుతోంది. ఒక్కొక్కరికి ఒక్కో భాగంలో మొదలై విస్తరిస్తోందీ. జీవనశైలిలో మార్పులు, చెడు అలవాట్లు, జన్యుపరమైన కారణాల వల్ల క్యాన్సర్ వ్యాధి సంక్రమిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాధిని ఆదిలోనే గుర్తిస్తే మందులతో నయం చేయవచ్చు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుంది. ఒకటి రెండు స్టేజీలు దాటితే మాత్రం సర్జరీల దాకా వెళ్లాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల నిర్వహించిన అసంక్రమిత వ్యా ధుల సర్వేలో ఉమ్మడి జిల్లాలో పలువరు వివిధ రకాల క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వైద్యాధికారులు గుర్తించారు.
కారణాలెన్నో..
సిగరెట్ తాగి ఒకరు క్యాన్సర్ బారిన పడితే.. మద్యం సేవించి మరొకరు. కలుషిత ఆ హారం తీసుకొని ఒకరు మహమ్మారి బా రిన పడితే.. పొగాకు, గుట్కా, పాన్ మసాలాలు తిని ఇంకొకరు ఇలా కారణాలేవైనా ప్రమాదం పొంచే ఉంది. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ క్యాన్సర్ వచ్చిన వాళ్లూ ఉన్నారు. కలుషిత, రసాయనాల పంటలు, పండ్లు తిని జబ్బు పడిన వారూ ఉన్నారు.
59
హనుమకొండ
మహబూబాబాద్
ములుగు
జిల్లాల వారీగా
క్యాన్సర్
బాధితులు
హద్దుల్లేని ఆనందంలో దంపతులు
మొదటి దశలో గుర్తిస్తే తొందరగా
నయమవుతుందంటున్న వైద్యులు
నేడు ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం
![క్యాన్సర్‌ను జయించి..1](https://www.sakshi.com/gallery_images/2025/02/4/grph_mr-1738613302-1.jpg)
క్యాన్సర్‌ను జయించి..
![క్యాన్సర్‌ను జయించి..2](https://www.sakshi.com/gallery_images/2025/02/4/03hmkd128-330087_mr-1738613302-2.jpg)
క్యాన్సర్‌ను జయించి..
![క్యాన్సర్‌ను జయించి..3](https://www.sakshi.com/gallery_images/2025/02/4/03hmkd127-330087_mr-1738613302-3.jpg)
క్యాన్సర్‌ను జయించి..
Comments
Please login to add a commentAdd a comment