కాజీపేట రైల్వే డివిజన్‌పై చిగురిస్తున్న ఆశలు
కాజీపేట రూరల్ : విశాఖపట్టణం హెడ్‌క్వార్టర్‌గా సౌత్ కోస్టు రైల్వే ఏర్పాటవుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ జోన్ కేంద్రంగా పలు డివిజన్‌లను విడదీసి హద్దులు ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ జోన్ కేంద్రంగా సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్, నాందేడ్ డివిజన్‌లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర విభజన చట్టం–2014లో పేర్కొన్న విధంగా విశాఖ రైల్వేజోన్, కాజీపేట రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటుకు అప్పటి పార్లమెంట్ కమిటీ సభ్యులు తీర్మానం చేశారు. విశాఖ రైల్వేజోన్, సౌత్ కోస్టు రైల్వే ఏర్పాటుకు కేంద్రం శ్రీకారం చుట్టడంతో వాల్టేర్, విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్‌లను సౌత్ కోస్టు రైల్వేలో విలీనం చేసేందుకు నిర్ణయించింది. అదేవిధంగా హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ రైల్వే డివిజన్‌లను దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ జోన్‌తో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిన ట్లు తెలుస్తోంది. దీంతో సికింద్రాబాద్ డివిజన్ పరిధి గతంలో కొండపల్లి నుంచి ఉండగా ప్రస్తుతం ఖమ్మం వద్ద మోటమర్రి నుంచి విజయవాడ డివిజన్‌లోకి వెళ్తుంది. కృష్ణా జిల్లా జాన్‌పాడ్, విష్ణుపురం, జగ్గయ్యపేట, బీబీనగర్.. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి వస్తాయి. గుంతకల్ డివిజన్ పరిధిలో ఉన్న వాడి–రాయచూర్ వరకు సికింద్రాబాద్ డివిజన్‌లోకి వస్తుంది. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ జోన్‌ను విభజిస్తుండటంతో ఆరు డివిజన్‌లు ఉన్న దక్షిణ మధ్య రైల్వే మూడు డివిజన్‌లకు పరిమితంకానుంది. దీంతో ఎన్నో ఏళ్ల ఓరుగల్లువాసుల, రైల్వే కార్మికుల కల అయిన కాజీపేట డివిజన్ ఏర్పాటుకు బాటలు పడుతున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కాజీపేట సబ్ డివిజన్ కేంద్రంగా బల్లార్షా, కరీంనగర్, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, కొండపల్లి, బీబీనగర్ వరకు కాజీపేట రైల్వే పాలన యంత్రాంగం విస్తరించి ఉంది. డివిజన్‌కు కావాల్సిన భౌగోళిక విస్తీర్ణం, సంప ద, భూమి, స్టేషన్లు, రైల్వే యూనిట్లు, కార్మికులు, అడ్మినిస్ట్రేషన్, రైల్వే ట్రాక్ విస్తీర్ణం, రైళ్ల సంఖ్య, ఆదాయం, ప్రయాణికుల సంఖ్య, కార్యాలయాల సంఖ్యతో పాటు ఇతరత్రా అన్ని అర్హతలు ఉన్నాయ ని, కాజీపేట డివిజన్ చేస్తే రైల్వేకు పాలనా సౌలభ్యంతోపాటు ఆదాయ లాభం, అభివృద్ధి జరుగుతుందని రైల్వే కార్మిక సంఘాల నాయకులు, కార్మి కులు, ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
కాజీపేట డివిజన్ కోసం పోరాటం చేయాలి
కాజీపేట డివిజన్ ఏర్పాటు కోసం మళ్లీ పోరాటం చేయాల్సి వస్తుందని రైల్వే కార్మిక నాయకులు అంటున్నారు. విశాఖ, సికింద్రాబాద్ రైల్వేజోన్ల విభజన వల్ల సికింద్రాబాద్ డివిజన్‌పై అధిక పనిభారం పడే అవకాశం ఉందని, ఈ క్రమంలో మరోసారి కాజీపేట డివిజన్ కోసం గొంతెత్తాలని, కలిసికట్టుగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ కేంద్రంగా
సౌత్ కోస్టు రైల్వే ఏర్పాటు
దక్షిణ మధ్య రైల్వే
సికింద్రాబాద్ జోన్ హద్దులు
Comments
Please login to add a commentAdd a comment