![సీఎంన](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/07022025-jgd_tab-07_subgroupimage_287193248_mr-1738871082-0.jpg.webp?itok=uGFakaC6)
సీఎంను కలిసిన ఎస్సీసెల్ బాధ్యులు
జనగామ: ఉభయ సభల్లో ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపిన సందర్భంగా రాష్ట్ర ఎస్సీసెల్ జాయింట్ కన్వీనర్ మిద్దెపాక సిద్ధులు గురువా రం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయనతోపాటు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు.
ఫుట్‌పాత్‌ల తొలగింపు
జనగామ: పట్టణంలో నెహ్రూపార్కు నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ఆక్రమించిన ఫుట్‌పాత్‌ల ను గురువారం మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వ ర్లు ఆదేశాల మేరకు పురపాలిక స్పెషల్ ఆఫీసర్ పులి శేఖర్ ఆధ్వర్యాన తొలగించారు. డ్రెయినే జీ, రోడ్లను ఆక్రమించి ఫుట్‌పాత్ వ్యాపారాలు చేస్తున్న వారిని హెచ్చరించడంతో పాటు సామగ్రిని తరలించారు.
జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు సాంకేతిక నిపుణుడిగా
‘గంగిశెట్టి’
జనగామ: డెహ్రాడూన్‌లో ఈనెల 7వ తేదీ నుంచి జరిగే జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు సాంకేతిక నిపుణుడిగా జనగామ మండలం చౌడారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు గంగిశెట్టి మనోజ్‌కుమార్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణగౌడ్, కోశాధికారి ఆవుల అశోక్, సభ్యులు చంద్రశేఖర్‌రెడ్డి, రంజిత్‌కుమార్, సురేష్, ప్రవీణ్, శ్రీదేవి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్య క్ష, కార్యదర్శులు గోపగోని సుగుణాకర్, హనుమంతరావు, తెలంగాణ వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు కొండా రవి తదితరులు మనోజ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు
45 మంది గైర్హాజరు
జనగామ రూరల్: జిల్లాలో గురువారం నిర్వహించిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు 45 మంది గైర్హాజరయ్యారని డీఐఈఓ కె.జితేందర్ రెడ్డి తెలిపారు. మొదటి సెషన్‌లో జనరల్, ఒకేషనల్ 496 మంది విద్యార్థులకు 470, రెండవ సెషన్‌లో జనరల్, ఒకేషనల్ 491 మందికి 472 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. జనగామలో ని పలు పరీక్ష కేంద్రాలను డీఈఐఓ, పాలకుర్తి, కొడకండ్ల కేంద్రాలను డెక్ సభ్యులు, నర్మెట, స్టేషన్‌ఘన్‌పూర్ సెంటర్లను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సందర్శించినట్లు వివరించారు.
సహాయ పరికరాలకు 230 దరఖాస్తులు
జనగామ రూరల్: ఆలింకో హైదరాబాద్ సంస్థ సహకారంతో దివ్యాంగులు, వయోవృద్ధులకు సహాయ పరికరాల ఎంపికకు నిర్వహించిన శిబిరాలు ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి 230 దరఖాస్తులు స్వీకరించి నట్లు జిల్లా సంక్షేమ అధికారి ఫ్లోరెన్స్ తెలిపారు. కలెక్టరేట్‌లోని శిబిరానికి గురువారం జనగామ రూరల్, మున్సిపాలిటీ, లింగాలఘణపురం, తరిగొప్పుల, నర్మెట, బచ్చన్నపేట మండలాల కు సంబంధించి 80 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలింకో కంపెనీ అధికారులు రష్మీ, రంజన్ శెట్టి, రాజబాబు, అభిషేక్, అఖిలేష్, సీడీపీఓ రమాదేవి, సీనియర్ అసిస్టెంట్ సంపత్‌కుమార్, ఫీల్డ్ రెస్పాన్స్ అధికారి రాజు, సదానందం, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించాలి
జనగామ రూరల్: పట్టణంలోని హైదరాబాద్ బైపాస్ రోడ్డు మీదుగా అండర్ పాస్ బ్రిడ్జి తప్పనిసరి నిర్మించాలి.. ఇందుకు కలెక్టర్ రిజ్వాన్ బాషా కృషి చేయాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బొట్ల శేఖర్ కోరారు. ఈ మేరకు సీపీఎం ఆధ్వర్యాన జిల్లా కేంద్రంలో చేపట్టిన దీక్షలు గురవారం కొనసాగాయి. ఈ కార్యక్రమంలో బూడిద ప్రశాంత్, తోటి దేవదానం, మబ్బు ఉప్పలయ్య, యాదగిరి, లక్ష్మి, అంజయ్య, మల్లేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
![సీఎంను కలిసిన ఎస్సీసెల్ బాధ్యులు
1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06jgn054-330003_mr-1738871082-1.jpg)
సీఎంను కలిసిన ఎస్సీసెల్ బాధ్యులు
![సీఎంను కలిసిన ఎస్సీసెల్ బాధ్యులు
2](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06jgn151-330150_mr-1738871082-2.jpg)
సీఎంను కలిసిన ఎస్సీసెల్ బాధ్యులు
![సీఎంను కలిసిన ఎస్సీసెల్ బాధ్యులు
3](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06jgn053-330003_mr-1738871082-3.jpg)
సీఎంను కలిసిన ఎస్సీసెల్ బాధ్యులు
Comments
Please login to add a commentAdd a comment