![నేతకార్మికుల స్థలానికి హద్దులు ఏర్పాటు చేయాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06jgn150-330150_mr-1738871083-0.jpg.webp?itok=bV7sA2Fa)
నేతకార్మికుల స్థలానికి హద్దులు ఏర్పాటు చేయాలి
జనగామ రూరల్: పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు ఏకశిలా పార్కు ఎదురుగా ఉన్న చేనేత కార్మికుల నివాస స్థలానికి సంబంధించి సర్వే చేపట్టి హద్దులు నిర్ణయించాలని సీపీఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాశ్, బూడిద గోపి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం పట్టణ కమిటీ ఆధ్వర్యాన కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రం 326/2, 328, 329 సర్వే నంబర్లలోని 4 ఎకరాల 30 గుంటల భూమిని జనగామ పట్టణానికి చెందిన చేనేత కార్మికులు 1994 సంవత్సరంలో కొనుగోలు చేసి ప్రభుత్వానికి అప్పగించగా.. 132 మందికి లేఔట్ ప్రకారం ప్లాన్ వేసి 120 చదరపు గజాల చొప్పున పట్టా సర్టిఫికెట్లు అందజేసిందన్నారు. ఆ స్థలం పట్టణానికి దూరంగా ఉండడం.. కనీస సౌకర్యాలు లేక పోవడం.. ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం రుణ సహాయం చేయకపోవడంతో కార్మికులు ఇళ్లు కట్టుకోలేక పో యారని చెప్పారు. ఇదే అదనుగా కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూమి హద్దులు చెరిపేసి సుమారు రెండున్నర ఎకరాలు కబ్జాచేసి అమ్ముకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ రోడ్డులోని ఎన్‌హెచ్–163 నుంచి పసరమడ్ల స్టేజీ వరకు నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు పేదల ఇళ్ల స్థలాల నుంచి పోతోందని, సర్వే చేపట్టి లేఔట్ ప్రకారంగా మొత్తం భూమికి హద్దులు నిర్ణయించాలని కోరారు. నాయకులు ఎండీ దస్తగిరి, పట్టణ కమిటీ సభ్యులు కల్యాణం లింగం తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం నాయకుల డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment