ఆర్థిక స్వావలంబన సాధించాలి
భూపాలపల్లి అర్బన్: వృత్తి శిక్షణ కోర్సులను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి కోరారు. సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృత్తి శిక్షణ కోర్సులను బుధవారం ఏరియాలోని కృష్ణాకాలనీ సింగరేణి మినీ ఫంక్షన్‌హాల్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జీఎం రాజేశ్వర్‌రెడ్డి, సేవా అధ్యక్షురాలు సునీతలు హాజరై కోర్సులను ప్రారంభించి మాట్లాడారు. టైలరింగ్, మగ్గం, బ్యూటిషన్, జ్యూ ట్ బ్యాగ్, ఫాషన్ డిజైనింగ్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్న ట్లు తెలిపారు. కార్యక్రమంలో అధికార ప్రతినిధి మారుతి, డీవైపీఎం క్రాంతికుమార్, సేవా కార్యదర్శి లక్ష్మి, సేవా సభ్యులు పాల్గొన్నారు.
పెద్దపల్లికి తరలిన అభ్యర్థులు
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమానికి బుధవారం ఏరియాలోని సింగరేణి ఉద్యోగ అభ్యర్థులు తరలివెళ్లారు. సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్సును ఏరియాలోని జీఎం కార్యాలయంలో జీ ఎం రాజేశ్వర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. సీఎం చేతుల మీదుగా ఉద్యోగ నియామక ప్రతాలను అందుకున్నట్లు జీఎం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment