బొగ్గుగనుల ప్రాంతాల్లో ప్రకంపనలు
బొగ్గు, ఇసుక నిక్షేపాలు ఉన్న ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వస్తుంటాయి. భూమి అడుగు భాగంలో వచ్చే మార్పుల వల్ల ఇలాంటివి సంభవిస్తాయి. భూమిపై ఒత్తిడి జరిగినప్పుడు ఇలాంటి ప్రకంపనలు వస్తాయి. మేడారంలో చెట్లు కూలిపోవడం, కొండాయిలో వరదలు రావడం, ఇప్పుడు భూమి కంపించడం ఇవన్నీ కూడా మానవ తప్పిదాలే. మనకు ఉన్న వనరులను కాపాడుకొని వాటికి ఒత్తిడి కలగకుండా, హాని చేయకుండా ఉంటేనే ఇలాంటి పెనుప్రమాదాలు రాకుండా ఉంటాయి. లేకుంటే మనం చేసే తప్పులే మానవ మనుగడకు ప్రశ్నార్థకమవుతాయి.
– ఆలం కిశోర్, జియాలజిస్ట్, ఐటీడీఏ, ఏటూరునాగారం
Comments
Please login to add a commentAdd a comment