చినుకు..వణుకు
భూపాలపల్లి రూరల్: తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం కు రుస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం తడుస్తుందని రైతుల గుండెల్లో గుబులు పట్టుకొంది. రెండు రోజులుగా కమ్ముకున్న మబ్బులకు, కు రుస్తున్న వర్షాలకు ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు అన్నదాతలు నానా పాట్లు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం వర్షానికి ఎక్కడ తడిసిపోతుందోనని భయంభయంగా కాలం గడుపుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది 1,10,593 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలనే ల క్ష్యంతో అధికారులు 189 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. తుపాను ఎక్కువైతే పొలాలు నీట మునిగి వరి ధాన్యం నేలరాలుతుందని కొంత మంది రైతులు మబ్బులు ఉన్నప్పటికీ పంట పొలాలను కోస్తున్నారు.
తేమ సమస్యతో ఇబ్బందులు..
15 రోజులుగా వాతావరణం చల్లగా ఉండడం, అక్కడక్కడ చిరుజల్లులు కురవడంతో కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం తేమ ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యంలో తేమ 17 శాతం ఉండాలి. కానీ చల్లగాలులతో ధాన్యంలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. జిల్లాలో 180 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ 664 టన్నులు మాత్ర మే కొనుగోలు చేశారు. తేమ (మాయిశ్చర్) ఎక్కువగా ఉందని పూర్తి స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదనే వాదనలున్నాయి.
ఇంటికే పరిమితం..
మంగళవారం నుంచి కురుస్తున్న చిరుజల్లులతోపా టు వీస్తున్న చల్లగాలులకు రైతులు, కూలీలు, ప్రజ లు పనులకు పోకుండా ఇంటికే పరిమితమయ్యా రు. ప్రతీ ఏడాది పంట కోసే సమయానికి తుపాను లేదా అకాల వర్షాలు కురవడంతో తీవ్రంగా నష్ట పోతున్నామని రైతులు అంటున్నారు.
జిల్లా వ్యాప్తంగా చలిగాలులు, వర్షాలు
ధాన్యం ఆరబెట్టుకోవడంలో
అన్నదాతల తిప్పలు
ఆందోళనలో రైతులు
కొనుగోళ్లలో వేగం పెంచాలని వేడుకోలు
ఇప్పటి వరకు 664 టన్నుల
ధాన్యం కొనుగోలు
పై ఫొటోలో కనిపిస్తున్న ధాన్యం కుప్పలు మల్హర్ మండలంలోని కొయ్యూరు కొనుగోలు కేంద్రంలోనివి. బుధవారం కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయింది. దీంతో ధాన్యం కుప్పల వద్ద నిల్వ ఉన్న నీటిని రైతులు తొలగిస్తున్నారు. కల్లాల్లో ఆరబోసిన ధాన్యాన్ని నిర్వాహకులు సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని, అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతుందని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి కొనుగోళ్లలో వేగం పెంచాలని కోరుతున్నారు.
తేమ శాతం చూడకుండా కొనుగోలు చేయాలి
15 రోజులుగా చల్లగాలులు వీస్తున్నాయి. దీంతో ధాన్యం ఆరబోసినప్పటికీ తేమ 17 శాతం రావడం లేదు. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి వాతావారణం ఒక్కసారిగా చల్లగా మారింది. అధికారులు తేమ శాతం చూడకుండా కొనుగోలు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. లేదంటే కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి పడిగాపులు గాయాల్సిందే.
–పోలవేని ఐలయ్య, రైతు, వేశాలపల్లి
జోరందుకున్న కోతలు..
జిల్లాలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. పలు ప్రాంతాల్లో ఇప్పటికే కోతలు జోరందుకున్నాయి. నూర్పిడి చేసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి ఆరబోస్తున్నారు. జిల్లాలో వర్షాలు కురుస్తాయనే వాతావారణ శాఖ హెచ్చరికలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రాలకు తరలించిన ధాన్యాన్ని తూకం వేసి త్వరగా మిల్లులకు తరలించి ఇబ్బందులు లే కుండా చూడాలని రైతులు కోరుతున్నారు.
కమ్ముకున్న మబ్బులతో భయమేస్తోంది
రేగొండ: ఖరీఫ్‌లో ఏడు ఎకరాల్లో వరి పంట సాగు చేశా. రెండు రోజుల క్రితం పొలం కో త పూర్తి చేశాం. ఆకాశంలో కమ్ముకున్న మబ్బులతో భయమేస్తుంది. కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తరలించి, నిబంధనల మేరకు విక్రయిస్తా.
– నంది విజయ్‌కుమార్, రైతు, రేగొండ
Comments
Please login to add a commentAdd a comment