పోలీస్‌స్టేషన్‌ తనిఖీ | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌స్టేషన్‌ తనిఖీ

Published Thu, Dec 5 2024 1:28 AM | Last Updated on Thu, Dec 5 2024 1:28 AM

పోలీస

పోలీస్‌స్టేషన్‌ తనిఖీ

కాళేశ్వరం: మహదేవపూర్‌ పోలీస్‌స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా కాటారం డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి సందర్శించారు. బుధవారం సర్కిల్‌ కార్యాలయంలో ఫైల్స్‌, రికార్డులు, పరిసరాలను తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించారు. సిబ్బందికి రికార్డ్స్‌, కేసుల పురోగతి విషయమై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆయన వెంట మహదేవపూర్‌ సీఐ రామచంద్రరావు, ఎస్సై పవన్‌కుమార్‌ పాల్గొన్నారు.

నూతన గనులు రాకుంటే మనుగడకు ప్రమాదం

భూపాలపల్లి అర్బన్‌: సింగరేణిలో నూతన బొగ్గు గనులు రాకుంటే సింగరేణి మనుగడ ప్రమాదకరమని, బొగ్గు గనుల ఏర్పాటు చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్‌ చేస్తున్నామని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూని యన్‌ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్‌ తెలిపారు. ఏరియా కేటీకే 6వ గనిలో పిట్‌ సెక్రటరీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన గేట్‌ మీటింగ్‌కు ముఖ్యఅతిథిగా రాజ్‌కుమార్‌ హాజరై మాట్లాడారు. బొగ్గు ఉత్పత్తి పెరగడానికి కార్మికులకు ఇన్సెంటివ్‌ విధానాన్ని అమలు చేసి ప్రోత్సాహక బహుమతులను అందజేయాలని కోరారు. సింగరేణిలో ఎంతో కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న టెక్నీషియన్లకు హెల్పర్లు ఇవ్వాలనే అంశంపై యాజమాన్యానికి వివరించామన్నారు. క్యాంటీన్ల కాంట్రాక్టు విధానాన్ని రద్దుచేసి క్యాంటీన్‌లను కార్మికులచే నిర్వహించాలని, సొంతింటి కల, మారు పేర్లతో ఉన్న వన్‌ టైం సెటిల్‌మెంట్‌ కింద సరిచేయాలని, ఖాళీగా ఉన్న పోస్టులను ఇంటర్నల్‌ ద్వారా మాత్రమే పూర్తిచేయాలని ప్లానింగ్‌ కమిటీలో చర్చించడం జరిగిందన్నారు. అనంతరం గనుల్లో నెలకొన్న సమస్యలపై గని మేనేజర్‌కు మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామ్‌ చందర్‌, నూకల చంద్రమౌళి, హకీమ్‌, లక్ష్మణామూర్తి, గోవర్ధన్‌, గణేష్‌, రాంబాబు, బ్రహ్మచారి పాల్గొన్నారు.

ప్రజాధనంతో

సర్కారు సంబురాలు

మొగుళ్లపల్లి: ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే ప్రజాధనంతో ప్రభుత్వం సంబురాలు చేసుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ చందుపట్ల కీర్తిరెడ్డి అన్నారు. బుధవారం రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు జిల్లాలోని మొగుళ్లపల్లి, టేకుమట్ల, చిట్యాల మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిపాలనపై నిరసనగా బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కీర్తిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషిదర్‌రెడ్డి, యాత్ర ప్రముఖ్‌ వెన్నంపల్లి పాపన్న, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు నాగపురి రాజమౌళిగౌడ్‌ హాజరయ్యారు. ముందుగా రంగాపురం గ్రామం నుంచి బైక్‌ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే.. ప్రజాధనంతో ప్రభుత్వం సంబురాలు చేసుకుంటోందన్నారు. కాంగ్రెస్‌ వైఫల్యాలపై బీజేపీ ఆధ్వర్యంలో చార్జ్‌షీట్‌ విడుదల చేశామన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తామని, స్థానిక ఎమ్మెల్యే కేవలం శిలాఫలకాలు వేసి అభివృద్ధి చేయడంలో పూ ర్తిగా విఫలమయ్యాడని ఆరోపించారు. ఈ కా ర్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్షులు చెవ్వ శేషగిరి, బుర్ర వెంకటేష్‌ గౌడ్‌, టేకుమట్ల ప్రధాన కార్యదర్శి గుర్రపు నాగరాజు, పార్లమెంట్‌ కోకన్వీనర్‌ లింగంపల్లి ప్రసాదరావు, అసెంబ్లీ కన్వీనర్‌ మేరే రవీందర్‌ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌ గలిఫ్‌, జగ్గయ్య, నాయకులు సంపత్‌ రావు, సాంబశివరావు పాల్గొన్నారు.

రామప్పలో మహారుద్ర యాగం

వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారి త్రక రామప్ప దేవాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశానుసారం మహారుద్రయా గం నిర్వహించినట్లు ఆలయ ఈఓ బిల్లా శ్రీని వాస్‌ తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రామప్పలో బుధవారం మహారుద్రయాగం నిర్వహించగా అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చినట్లు తెలిపారు. యాగం అనంతరం 200మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఈఓ వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
పోలీస్‌స్టేషన్‌ తనిఖీ
1
1/1

పోలీస్‌స్టేషన్‌ తనిఖీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement